'మా'లొల్లి మళ్లీ మొదటికి... ఈసారి వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీనామా  

Sv Krishna Reddy Resign To Maa Vice President Post-

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన మా అనగానే అంతా కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు, క్రికెట్‌ను గుర్తుకు తెచ్చుకునే వారు. కాని ప్రస్తుత పరిస్థితి వేరుగా ఉంది. అప్పట్లో మా సభ్యులు అంతా కూడా క్రికెట్‌ ఆడి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేవారు..

'మా'లొల్లి మళ్లీ మొదటికి... ఈసారి వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీనామా-SV Krishna Reddy Resign To Maa Vice President Post

కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు కూడా మా ఎక్కువగా మీడియాలో ఉంటుంది. కాని మీడియాలో ఉండటంకు కారణం వివాదాలు.

గత కొంత కాలంగా మా లో ఉన్న వారు నిధులు దుర్వినియోగం చేస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది.

మొన్న జరిగిన ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. శివాజీ రాజా మరియు నరేష్‌ లు వ్యక్తిగతంగా దూషించుకుంటూ ఎన్నికల్లో పోటీ పడ్డారు.

రాజకీయ ఎన్నికలను తలపించేలా ఎన్నికలు జరిగాయి. పెద్ద ఎత్తున డబ్బును కూడా పంచారు అంటూ వార్తలు వచ్చాయి. ఎన్నికలు పూర్తి అయ్యి నరేష్‌ ప్యానల్‌ గెలుపొందిన తర్వాత కూడా వివాదం జరిగింది.

తాజాగా వైఎస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నిక అయిన ఎస్వీ కృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దం అయ్యాడు.

మా కార్యవర్గంలో జరుగుతున్న పరిస్థితులు, ఆర్థిక విషయాల్లో కొందరి ఏకపక్ష నిర్ణయాల కారణంగా తాను ఇందులో ఉండలేక పోతున్నాను అంటూ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నిక అయిన ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. అధ్యక్షుడికి ఆయన తన రాజీనామా లేఖను ఇచ్చినట్లుగా కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆయన్ను కార్యవర్గం బుజ్జగించి పదవిలో కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఎంపిక అయ్యి నెలలు కూడా గడవక ముందే రాజీనామా చేస్తే ప్యానల్‌ పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ఆయన్ను కొనసాగాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వివాదం మరింత ముదురుతుందా లేదంటే ఎస్వీ కృష్ణారెడ్డి శాంతిస్తాడా అనేది చూడాలి.