సూర్య ఆ అయిదు సినిమాల్లోని సీన్స్‌ ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి  

Sutya Bandobasth 7th Sense - Telugu Bandobasth, Brothers, Drug Smugler, Kollywood, Seventh Sens, Surya, Uriyadhi, Veedokkade, Vizag Gas Leakege

ప్రస్తుతం ఇండియాను వణికిస్తున్న రెండు విషయాలు కరోనా మరియు మిడతలు.ఈ రెంటిలో ఒకటి మనుషుల ప్రాణాలు తీసే కరోనా కాగా మరోటి భూమి మీద పచ్చదనం అనేది లేకుండా చేసే మిడతలు.

 Sutya Bandobasth 7th Sense

ఈ రెండు కూడా అత్యంత ప్రమాదకారి.ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ రెండు ఇప్పటికే సినిమాల్లో చూపించారు.

కరోనా వైరస్‌ గురించి ఎన్నో సినిమాల్లో చూపించారు.ఇక మిడతల దండు దాడి గురించి సూర్య నటించిన బందోబస్తు చిత్రంలో చూపించడం జరిగింది.

సూర్య ఆ అయిదు సినిమాల్లోని సీన్స్‌ ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సూర్య హీరోగా నటించిన సెవంత్‌ సెన్స్‌ సినిమాలో చైనా నుండి వచ్చిన ఒక వైరస్‌ వల్ల దేశంలో అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొన్ని వందల మంది మృతి చెందుతారు.

అలాంటి వైరస్‌ ఇప్పుడు కరోనా పేరుతో ఇండియన్స్‌ పాలిట మృత్యు ఘంటికలు మోగిస్తుంది.ఇక బందోబస్తు సినిమాలో దర్శకుడు ఆనంద్‌ మిడతలు పాకిస్తాన్‌ నుండి ఇండియా మీదకు దాడి చేయడం, దాంతో ఇండియన్‌ రైతులు తీవ్రంగా నష్టపోవడం చూపించారు.

ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా సూర్య హీరోగా నటించిన బ్రదర్స్‌ చిత్రంలో రష్యా నుండి ఒక నిషేదిత డ్రగ్‌ ఇండియాలో అమ్మడం, వీడొక్కడే సినిమాలో కడుపులో డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేయడం వంటివి చూపించారు.అవి కూడా నిజంగా జరిగాయి.ఇక సూర్య నిర్మించిన ఉరియాది చిత్రంలో గ్యాస్‌ లీకేజీకి సంబంధించిన సీన్‌ ఉంటుంది.అది అచ్చు విశాఖపట్నం గ్యాస్‌ లీకేజీని పోలి ఉంది.మొత్తానికి సూర్య 5 సినిమాల్లో గతంలో చూపించిన సీన్స్‌ ఇప్పుడు రియల్‌ లైఫ్‌ లో నిజం అయ్యాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test