ఆ యాక్టింగ్ మాస్టర్ ని మొత్తానికి అరెస్ట్ చేసారు!

తనకి యాక్టింగ్ నేర్పించాలంటే బట్టలిప్పి చూపించాలని సూద్రదారి యాక్టింగ్ స్కూల్ నడుపుతున్న నటుడు వినయ్ వర్మ వేధించాడని ఓ అమ్మాయి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నారాయణగూడ లో పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఈ న్యూస్ టాలీవుడ్ లో సంచలనంగా మారడంతో పాటు, మరో సారి టాలీవుడ్ లో లైంగిక వేధింపులు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 Sutradhar Acting School Director Arrested-TeluguStop.com

దీనిపై వినయ్ వర్మ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.తాను అలా అనలేదని చెప్పే మీడియా ముందుకి వచ్చాడు.

ఇదిల ఉంటే తాజాగా సూత్రధారి యాక్టింగ్ స్కూల్‌ యజమాని వినయ్‌ వర్మను పోలీసులు అరెస్ట్‌ చేశారు.నటన నేర్చుకోవాలంటే నగ్ననంగా ఉండాలని షరతులు విధించి 9 మంది యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడు అనే ఆరోపణలపై వినయ్‌ వర్మ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిర్భయ యాక్ట్‌, 506, 509 ఐపీసీ సెక్షన్ల కింద అతని మీద కేసులు నమోదు చేశారు.విచారణ నిమిత్తం వినయ్ వర్మని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.మరి ఈ సంఘటనపై టాలీవుడ్ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube