ఈ పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రస్తుతం అలాంటి పాత్రలలో....

తెలుగులో ప్రముఖ దర్శకుడు “భీమనేని శ్రీనివాసరావు” దర్శకత్వం వహించినటువంటి “సుస్వాగతం” అనే చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించగా హీరోయిన్ గా కోలీవుడ్ హీరోయిన్ “దేవయాని” నటించింది.

 Suswagatham Movie Fame Devayani Marriage And Movie Offers News, Devayani, Telugu-TeluguStop.com

 తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి  స్టార్ హీరోల సరసన దేవయాని నటించినప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రం హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.

దీనికితోడు దీనికితోడు నటి దేవయాని తెలుగులో నటించినటువంటి చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

 దీంతో నటి దేవయాని తెలుగులో హీరోయిన్ గా రాణించక పోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేక పోవడంతో రాజకుమారన్ అనే తమిళ ప్రముఖ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 అయితే పెళ్లయిన తర్వాత అడపాదడపా చిత్రాలలో నటి దేవయాని కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేక పోతోంది.దీంతో ఇక చేసేదేమీలేక తన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమయింది.

కాగా నటి దేవయాని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (సుస్వాగతం), నందమూరి నటసింహం బాలకృష్ణ (చెన్నకేశవ రెడ్డి), టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు (నాని) ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ (మాణిక్యం) తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించినప్పటికీ ఎందుకో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేక పోయింది. దీంతో దేవయాని ఒక పక్క తన కుటుంబ బాధ్యతలను బెట్టుకుంటూ మరోవైపు సినిమాల్లో నటిస్తోంది.

కాగా ప్రస్తుతం దేవయాని తన కుటుంభం సభ్యులతో కలిసి తమిళనాడులోని చెన్నైలో నివాసముంటున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube