అనుమానం ప్రాణం తీసింది.. సమాజం మారదా?..  

Suspicion kills will society cahnge Sanga Reddy, Ananthaagar, Knife Attack, CI Ravindar Reddy, Wife And Husband, - Telugu Ananthaagar, Ci Ravindar Reddy, Knife Attack, Sanga Reddy, Wife And Husband

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది.ఇలాంటి సంఘటనలు సమాజంలో తరచుగా చోటుచేసుకోవడం గమనార్హం.

TeluguStop.com - Suspicion Kills Will Society Cahnge

ఇందుకు ముఖ్యంగా సమాజంలో ఏ బంధానికైనా ఉన్న విలువను గుర్తించి, జీవితం పట్ల జవాబుదారీతనంతో, సమాజ కట్టుబాట్లను పాటించకపోవడం వల్ల జరిగే అనర్థాలను గుర్తించి, మనిషి కుటుంబ మనుగడలో వచ్చే కొద్దిపాటి ఒడిదుడుకులను.సమయస్ఫూర్తితో ఒకరినొకరు అర్థం చేసుకొని.

, ఓర్పు, సహనం వహించి.మెలిగితే తప్పకుండా భావి జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు.

TeluguStop.com - అనుమానం ప్రాణం తీసింది.. సమాజం మారదా..-General-Telugu-Telugu Tollywood Photo Image

కానీ ఆధునిక సమాజంలో మితిమీరి పోయిన పాశ్చాత్య నాగరికత వల్ల అనర్థాలు చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ లో ఒక వ్యక్తి తన భార్య పై అనుమానంతో, భార్య తల నరికి అతి కిరాతకంగా హతమార్చాడు.

సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.జుర్రు సాయిలు, అంశమ్మ అను భార్య భర్తలు అనంతసాగర్ లో కాపురం ఉంటున్నారు.అంశమ్మ కు గత కొంత కాలంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని సాయిలు అనుమానిస్తున్నాడు.ఈ క్రమంలో ఆమెతో చాలా సార్లు గొడవ పడ్డాడు.

బుధవారం రాత్రి సైతం భార్యతో గొడవ పడి విచక్షణ కోల్పోయి గొడ్డలితో దాడి చేశాడు.అతి కిరాతకంగా శరీరం నుంచి తలను వేరు చేసి, అనంతరం మొండెం ను ఇంటి సమీపంలో పడేసి, తలను నారాయణఖేడ్ తీసుకెళ్లి అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి గుమ్మం ముందు ఉంచాడు.

ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

#Sanga Reddy #Ananthaagar #Knife Attack

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suspicion Kills Will Society Cahnge Related Telugu News,Photos/Pics,Images..