వేటు పడబోయే మంత్రులు వీరిద్దరే నా ?  

Andhra Pradesh, YCP, Jagan, Botsa Satyanarayana, Pushpa Sreevani, Avanthi Srinivas, Pilli Subhash, Mopidevi Venkataramana - Telugu Andhra Pradesh, Avanthi Srinivas, Botsa Satyanarayana, Jagan, Mopidevi Venkataramana, Pilli Subhash, Pushpa Sreevani, Ycp

ఏపీ క్యాబినెట్ లు త్వరలో మార్పుచేర్పులు జరగబోతున్న నేపథ్యంలో, ఆ పార్టీలో సందడి వాతావరణం నెలకొంది.ఈనెల 22వ తేదీన క్యాబినెట్ ప్రక్షాళన చేయబోతున్నట్టు జగన్ సంకేతాలు ఇవ్వడంతో, ఆశావాహులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు.

 Suspension On Ycp Ministers

జగన్ తప్పకుండా తమకు అవకాశం ఇస్తారని, ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు.ప్రస్తుతం మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ, తమ మంత్రి పదవులకు రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో, ఆ రెండు స్థానాలతో పాటు, పనితీరు సక్రమంగా లేని మరి కొంతమందిని జగన్ తప్పించబోతున్నారు అనే వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జగన్ ఎవరిని తప్పిస్తారు ? ఎవరిని నియమిస్తారు అనే ఉత్కంఠ ప్రస్తుతం వైసీపీలో నెలకొంది.ప్రస్తుతం రాజీనామా చేయబోతున్న ఇద్దరు మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, తప్పకుండా ఆ స్థానాల్లో ఇద్దరు బీసీలను మంత్రులుగా జగన్ ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి.

వేటు పడబోయే మంత్రులు వీరిద్దరే నా -Latest News-Telugu Tollywood Photo Image

అదీ కాకుండా, పనితీరు సక్రమంగా లేని మరో ఇద్దరిపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం.ఈ మేరకు విశాఖ జిల్లాకు చెందిన కీలక నాయకుడు, ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యవహారంపై జగన్ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

విశాఖ కేంద్రంగా ఎన్నో సంఘటనలు చోటుచేసుకోవడం, పార్టీకి తీవ్ర ఇబ్బందులు తీసుకొచ్చాయి.ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో అవంతి పెద్దగా స్పందించలేదని, ఇవే కాకుండా, మరి కొన్ని కారణాలతో ఆయనపై జగన్ గుర్రుగా ఉన్నారని, ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలనే ప్రచారం వైసీపీలో వ్యక్తమవుతోంది.

ఆయన కాకుండా, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి ని జగన్ తప్పిస్తారనే ప్రచారం వైసిపి లో ఎక్కువైంది.

ఆమె కేవలం తన నియోజక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుండడం, పార్టీకి మైలేజ్ తీసుకువచ్చే విధంగా వ్యవహరించ లేకపోవడం, ప్రస్తుత ఏపీ మంత్రిగా ఉన్న అదే జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ దూకుడుగా ముందుకు వెళ్తున్నా, ఆయన స్థాయిని అందుకోలేక పోవడం వంటి కారణాలతో ఆమె పైన జగన్ గుర్రుగా ఉన్నారని, వారి వల్ల పార్టీకి ప్రభుత్వానికి పెద్దగా కలిసి రావడం లేదనే అభిప్రాయం జగన్ లో ఉన్నట్లు తెలుస్తోంది .ఈమేరకు పుష్పశ్రీవాణి పైనా వేటు పడే అవకాశం ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది.మరి ఈ విషయంలో జగన్ ఏ కీలక నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

#Andhra Pradesh #YCP #Jagan #Pilli Subhash #Pushpa Sreevani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suspension On Ycp Ministers Related Telugu News,Photos/Pics,Images..