లోకేష్ పోటీ ఇక లేనట్టేనా..? చినబాబు సైడ్ అవుతాడా..??  

  • ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నా లోకేష్ రానున్న ఎన్నికల్లో లో పోటీ చేస్తారా?? లేదా?? అనే సందేహాలు టీడీపీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంతేకాదు రాజకీయ వర్గాలలో సైతం లోకేష్ బాబు పొతే ఉన్నట్లా లేనట్లా అనే విషయంపై తలోరకంగా విశ్లేషణలు చేస్తున్నారట. సొంత పార్టీ నేతలే ఈ సందేహాలు వ్యక్తం చేయడంతో అసలు లోకేష్ పోటీ చేస్తారా లేదా?? అనే చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది.

  • జనసేన అధినేత కి , లోకేష్ బాబు కి కి ఒక విషయంలో మాత్రం దగ్గర పోలికలు ఉన్నాయి అదేంటంటే మొదట్లో పవన్ కళ్యాణ్ సింహభాగం రాజకీయాలు ట్విట్టర్ ద్వారానే చేసేవారు ఆ తరువాత అ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ట్విట్టర్ ని పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ రాజకీయాలని ఫాలో అవుతున్న చినబాబు ఎంతసేపు ఆన్లైన్లోనే రాజకీయాలు చేయడం పార్టీలో నేతలకి విసుగు తెప్పిస్తోందట. ఈ మధ్యకాలంలో లోకేష్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పాలి రాజకీయ కార్యకలాపాల్లో పైగా ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో లో చురుకుగా ఉండాల్సిన లోకేష్ సైలెంట్ రాజకీయాలు నడపడం కార్యకర్తలని మింగుడు పడటంలేదట

  • Suspense Over Nara Lokesh About Contesting Assembly Elections-Bheemili Constituency Nara Titter Politics

    Suspense Over Nara Lokesh About Contesting Assembly Elections

  • ఇదిలాఉంటే భీమిలి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి లోకేష్ పోటీ చేస్తారు అనే వార్తలు వచ్చిన విషయం విధితమే అయితే అది లీకేజ్ మాత్రమేనని అధికారిక ప్రకటన కాదని క్లారిటీ ఇచ్చారు పార్టీ నేతలు. అయితే ఈలోగానే ఎన్నికల షెడ్యూల్ రావటం నెల రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో లో లోకేష్ భీమిలి నుంచి పోటీ చేస్తారా అనే సందేహం అందరికీ కలిగింది. ఒకవేళ గా పోలింగ్ గనుక ఏప్రిల్ రెండో వారంలో కాకుండా చివరి వారంలో లో గనుక ఉండి ఉంటే లోకేష్ భీమిలి నుంచి పోటీ చేయడానికి అవకాశాలు ఉండేవని కానీ నెల రోజుల్లో పోలింగ్ పెట్టుకుని భీమిలి నుంచి పోటీ చేయడం అసంభవమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

  • Suspense Over Nara Lokesh About Contesting Assembly Elections-Bheemili Constituency Nara Titter Politics
  • అయితే చంద్రబాబు తాజాగా విడుదల చేసిన మొదటి లిస్టు లో లోకేష్ పేరు లేకపోవడంతో లోకేష్ పోటీ పై మరింత సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు లోకేష్ పోటీ చేస్తారా లేదా అంటూ ముందు నుంచీ సదేహాలు వ్యక్తం చేస్తున్న విమర్శకులు మాత్రం లోకేష్ పోటీ ఇక లేనట్టే అంటున్నారు. అయితే పార్టీ నేతలు మాత్రం త్వరలోనే లోకేష్ పోటీ చేసే స్థానంపై బాబు క్లారిటీ ఇస్తారని, భవిష్యత్తులో టీడీపీని భుజాన వేసుకోవాల్సిన లోకేష్ పోటీ చేయడం పక్కా అంటున్నారు. మరి లోకేష్ పోటీ చేయబోయే నియోజకవర్గం పై బాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో వేచి చూడాలి.