చివరి నిమిషంలో మనసు మార్చుకున్న దర్శకుడు.. మహేష్‌ 25 టైటిల్‌ ఆగింది  

Suspense On Mahesh Babu 25th Movie Title-

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదలకు రంగం సిద్దం చేశారు.రేపు మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా నేడే ఫస్ట్‌లుక్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ చిత్రం టైటిల్‌ను కూడా ఫస్ట్‌లుక్‌ విడుదల రోజు ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ రావడం లేదని, టైటిల్‌ను మరేదైనా మంచి అకేషన్‌కు ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు..

Suspense On Mahesh Babu 25th Movie Title--Suspense On Mahesh Babu 25th Movie Title-

గత నాలుగు రోజుగా దర్శకుడు వంశీ పైడిపల్లి వరుసగా ఆర్‌, ఐ, ఎస్‌, హెచ్‌, ఐ అక్షరాలను విడుదల చేయడం జరిగింది.ఈ అక్షరాల ఆధారంగా మహేష్‌బాబు 25వ చిత్రం టైటిల్‌ ‘రిషి’ అని అంతా భావించారు.సినీ వర్గాల నుండి కూడా లీక్‌ అయ్యింది.మహేష్‌బాబు రిషి టైటిల్‌పై ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.గతంలో మహేష్‌ చేసిన రెండు అక్షరాల చిత్రాలు వంశీ మరియు నిజంలు బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడ్డాయి.

దాంతో ఈ చిత్రానికి రెండు అక్షరాల పేరు వద్దని ఫ్యాన్స్‌ కోరారు..

మహేష్‌బాబు 25వ చిత్రం టైటిల్‌ విషయంలో దర్శకుడు వంశీ వెనక్కు తగ్గినట్లుగా అనిపిస్తుంది.రిషి టైటిల్‌ను కాదని మరో టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకు రాబోతున్నారు.సినిమాలో మహేష్‌బాబు పోషిస్తున్న పాత్ర పేరు రిషి అని, ఇది టైటిల్‌ కాదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

వ్యతిరేకత రాకుంటే అదే టైటిల్‌ను అనుకున్నారు.కాని వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వస్తున్న కారణంగా వెంటనే కొత్త టైటిల్‌ అన్వేషణలో పడ్డారు.

రిషి టైటిల్‌ మార్చడంతో కొత్త టైటిల్‌ను ఖరారు చేసేందుకు ఇప్పుడు సమయం లేదు.అందుకే టైటిల్‌ లేకుండానే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని సమాచారం అందుతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న మహేష్‌బాబు 25వ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది.ఇక ఈ చిత్రంను దిల్‌రాజు, అశ్వినీదత్‌, ప్రసాద్‌ వి పొట్లూరిలు నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం మహేష్‌ స్తాయిని పెంచే విధంగా ఉంటుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు..