ఏపీ కేబినెట్ భేటీ పై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్  

Suspense Continues Over Ap Cabinet Meeting-ap Govt Cs,cm Chandrababu,election Commission,suspense Continues

ఏపీ కేబినెట్ భేటీ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటివరకు కూడా ఈసీ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి రాకపోవడం తో ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయంశంగా మారింది. మరోపక్క ఏపీ సి ఎం చంద్రబాబు తో సి ఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ అయినట్లు తెలుస్తుంది..

ఏపీ కేబినెట్ భేటీ పై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్-Suspense Continues Over AP Cabinet Meeting

ఇప్పటికే బేదాభిప్రాయాల తో ఉన్న వీరి మధ్య భేటీ జరగడం పై ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ లో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి అన్న సస్పెన్స్ అందరిలోనూ కొనసాగింది. ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 10 న నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ సమావేశ నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి కావలి అని దానికి కనీసం 48 గంటల ముందు పంపాలని నిబంధనలో ఉన్నట్లు సి ఎస్ తెలిపారు. ఈ క్రమంలో కేబినెట్ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం అజెండాను సి ఎస్ నేతృత్వం లోని స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కి పంపినట్లు తెలుస్తుంది.

అయితే శుక్రవారం నివేదిక పంపగా ఆదివారం రాత్రి వరకు కూడా ఎన్నికల కమీషన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తో ఈ రోజు సి ఎం చంద్రబాబు,సి ఎస్ తో భేటీ అయ్యారు. అయితే ఆదివారం 7 రాష్ట్రాల్లో 6 వ విడత ఎన్నికల పోలింగ్ జరిగినందున సిబ్బంది బిజీ గా ఉంటారని సోమవారం సాయంత్రానికి ఈసీ నిర్ణయం తెలియజేస్తుంది అని ఈసీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం నాటికి కేబినెట్ భేటీకి అనుమతి వచ్చినా గంటల వ్యవధిలో మంత్రులకు సమాచారం చేరవేసి, అధికారులను సిద్ధం చేసి సమావేశం నిర్వహించడం సాధ్యమేనా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి నాలుగు అంశాలతో కేబినెట్ భేటీకి సీఎస్ అనుమతి కోరారని తెలిపాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి. ఏపీ కేబినెట్ భేటీ అంశం ఇంకా తమ పరిశీలనలోనే ఉందని సోమవారం సాయంత్రానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి.

ఏపీ కేబినెట్ భేటీ పై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్