'ఆమంచి' బాటలోనే 'తోట'...? తూర్పు లో మంతనాల వెనక మతలబు ఏంటో ..?  

Suspense About Thei Krishna Mohan And Thota Trimurthulu Decision-

సైకిల్ పార్టీ నుంచి ఒక్కో నేత దిగిపోయేందుకు సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ పెద్దలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు..

Suspense About Thei Krishna Mohan And Thota Trimurthulu Decision--Suspense About Thei Krishna Mohan And Thota Trimurthulu Decision-

మరోవైపు చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోన్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉండగానే ఆయన అకస్మాతుగా… తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం రావడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

తాజాగా కృష్ణమోహన్.ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో భేటీ అయ్యారు.సీఎం కలవమంటే ఇవాళే.లేకుంటే రేపైనా కలుస్తానన్నారు.అయితే, ఆమంచి కృష్ణ మోహన్, తోట త్రిమూర్తులు భేటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది.ఇప్పటికే టీడీపీ వైఖరిపై తోట త్రిమూర్తలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

అదే దారిలో ఆమంచి కృష్ణమోహన్ వెళ్లిపోయారు.ఇక ఈ ఇద్దరు నేతలు పలువురు కాపు నేతలతో మంతనాలు సాగించారు.