ఓరి నాయనో.. సుస్మితాసేన్ కి ఇన్ని ఆస్తులు ఉన్నాయా?

సినిమా సెలబ్రిటీల కు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే అటు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి కరంగానే ఉంటుంది.అందుకే ఇక సినీ సెలబ్రిటీలకు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఎప్పుడూ సోషల్ మీడియాలో వెతకడం చేస్తూ ఉంటారు నెటిజన్లు.

 Susmitha Sen Properties And Details, Bollywood Actress, Heroine Sushmitha Sen, S-TeluguStop.com

ముఖ్యంగా సినిమా హీరో హీరోయిన్లు  ఆస్తుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా  కొనసాగి ఇప్పటికీ హవా నడుస్తున్న సుష్మితా సేన్ కి ఎంత ఆస్తి ఉంది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.

ఒకప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సుస్మితాసేన్ స్టార్ హీరోయిన్ గా ఎలా రాణించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందరి స్టార్ హీరోల సరసన నటించింది తన అందంతో అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.

మొన్నటివరకు సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ఓటిటీల్లో సత్తా చాటుతోంది.అయితే 18 ఏళ్లకే మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న ఈ హాట్ బ్యూటీ.ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి చక్రం తిప్పింది.1996 లో దస్తక్ అనే సినిమాతో సినిమా ప్రపంచంలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది.ఇక మొదటి సినిమాతోనే తన అందంతో అందరిని కట్టిపడేస్తుంది.ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు.కాగా 46 ఏళ్ల సుస్మిత సేన్ ఆస్తుల విలువ తెలిస్తే మాత్రం అవాక్కవుతారు.

అయితే మొత్తంగా సినిమాల ద్వారా వెబ్సైట్ల ద్వారా ఈ మాజీ విశ్వసుందరి బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది.దాదాపు సుస్మితాసేన్ ఆస్తుల విలువ 74 కోట్ల వరకు ఉంటుందని టాక్.ఇక ఇప్పుడు 46 ఏళ్ల వయసులో కూడా సీనియర్ హీరోయిన్ నెలకు అరవై లక్షల వరకు సంపాదిస్తుందట.

అంతేకాదండోయ్ ఏకంగా స్టార్ హీరోయిన్లతో పోటీపడుతూ ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంటుందట ఈ హాట్ సీనియర్ హీరోయిన్.ఇక ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కూడా సుష్మితా సేన్ అల్లరిస్తూ ఉంటుంది.ఇక ఒక్కో వాణిజ్య ప్రకటనకు 1.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందటా ఈ ముద్దుగుమ్మ.ఇలా 46 ఏళ్ల వయసులో కూడా ఓ వైపు సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్ ఇంకో వైపు అది ప్రకటనతో రెండు చేతులారా సంపాదిస్తుందట.

Actress Sushmita Sen Assets Details Sushmita Sen Net Worth

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube