పిల్లల డాన్స్ కి ఫిదా అయిన మాజీ విశ్వ సుందరి

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువైంది.ఈ కారణంగా ఎవరైనా కొత్తగా ఎం చేసిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

 Sushmita Sen Tweet Children Dance Video, Bollywood, Indian Cinema, World Dance,-TeluguStop.com

సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ కూడా అలాంటి వీడియోలు చూస్తూ షేర్ చేస్తూ ఉంటారు.ఎవరైనా సెలబ్రెటీ దృష్టిలో ఒక వీడియో పడింది అంటే, దానిని వారు షేర్ చేస్తారు.

అలాంటి వీడియోలు మరింత వేగంగా వైరల్ అయిపోతారు.ఈ మధ్యకాలంలో యుట్యూబ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫార్మ్స్ లో ఆఫ్రికన్ దేశాలకి చెందిన పిల్లలు చేసే డాన్సింగ్ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

పేదరికంలో, ఒక్కపూట తింటూ దారిద్యంలో జీవితాలు అనుభవించే ఆఫ్రికన్ దేశాలకి చెందిన చిన్నారులు వారిలోనే డాన్స్ టాలెంట్ ని చూపిస్తూ వీడియోలు చేస్తూ ఉన్నారు.ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు అలాంటి ఒక వీడియో మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ దృష్టిలో పడింది.

వెంటనే ఆ వీడియోని ఆమె తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

దాంట్లో ఓ ముగ్గురు నిరుపేద పిల్లలు ప్రొఫిషినల్‌ డాన్సర్ల మాదిరి చిందులేశారు.కొంత మంది హీరోలు సైతం వేయలేని స్టెప్పులేశారు.

పాటకు తగ్గ స్టెప్పులేస్తూ ఔరా అనిపించారు.ఈ వీడియోను సుష్మిత ట్వీట్‌ చేస్తూ వారి నవ్వును ఒకసారి చూడండి.

కల్మషం లేని నవ్వు వారిది, పరిపూర్ణమైన ఆనందం వారిది.ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోయా.

ఐ లవ్‌యూ గాయ్స్‌ అని చెప్పుకొచ్చారు.ఆమె షేర్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది.

సుస్మితా సేన్ ని ఫాలో అవుతున్న అభిమానులు అందరూ ఆ పిల్లల డాన్స్ వీడియోని చూస్తూ షేర్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube