15 ఏళ్ల చిన్నవాడిని ప్రేమిస్తానని అనుకోలేదు : సుస్మితా సేన్  

susmita sen opens up about dating with rohaman, 15 years younger, dating, susmita sen - Telugu 15 Years Younger, Dating, Rohaman, Susmita Sen

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ మూడేళ్ల క్రితం నుంచి ఒక యువకునితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.సుస్మితా డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఆమె కంటే 15 సంవత్సరాలు చిన్నవాడు.

TeluguStop.com - Sushmita Sen Opens Up Her Dating With Rohaman

వయస్సులో చిన్నవాడితో డేటింగ్ చేయడానికి గల కారణాలను వెల్లడిస్తూ సుస్మితా సేన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.ఒక ఇంటర్వ్యూలో సుస్మిత మాట్లాడుతూ తను డేటింగ్ చేస్తున్న రోహమాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడని వెల్లడించారు.

రోహమాన్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక మెసేజ్ పెట్టాడని.ఆ మెసేజ్ వల్ల అతనితో పరిచయం ఏర్పడిందని అన్నారు.ఆ తరువాత కొన్నిరోజులు చాటింగ్ చేసుకున్నామని.తాను 15 సంవత్సరాల చిన్నవాడిని ప్రేమిస్తానని కలలో కూడా అనుకోలేదని సుస్మిత చెప్పారు.

TeluguStop.com - 15 ఏళ్ల చిన్నవాడిని ప్రేమిస్తానని అనుకోలేదు : సుస్మితా సేన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మనం ఏదైనా అనుకుంటే అలా అనుకున్నంత మాత్రాన అది జరగదని.ఏదైనా రాసిపెట్టి ఉంటే మాత్రమే జరుగుతుందని సుస్మిత చెప్పుకొచ్చారు.

Telugu 15 Years Younger, Dating, Rohaman, Susmita Sen-Movie

రోహమాన్ తో తను చాలా సంతోషంగా ఉన్నానని.తను పంచే ప్రేమ ఆనందానికి కారణమవుతోందని తెలిపారు.పెళ్లి కాకుండా ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్న సుస్మిత పిల్లలు, రోహమాన్ తన కుటుంబం అని వెల్లడించారు.లైఫ్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని.రోహమాన్ పరిచయం కూడా ఊహించకుండా జరిగిందని.రోహమాన్ లాంటి వ్యక్తిని తన లైఫ్ లోకి పంపినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు.

తాను రొమాంటిక్ కాదని మహిళగా ఒక తోడు ఉండాలని తాను ఎప్పుడూ భావించనని సుస్మిత తెలిపారు.తాను ఫ్యాషన్ ను ఎక్కువగా ఫాలో కానని సౌకర్యవంతంగా ఉండే దుస్తులనే ఎక్కువగా ఎంచుకుంటానని సుస్మిత వెల్లడించారు.

అయితే సుస్మిత 15 సంవత్సరాల చిన్నవ్యక్తితో డేటింగ్ చేయడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు చిన్నవాడితో డేటింగ్ చేయడం కరెక్ట్ కాదని చెబుతుంటే మరికొందరు చిన్నవ్యక్తితో డేటింగ్ చేసినా తప్పు లేదని అభిప్రాయపడుతున్నారు.

#Susmita Sen #Dating #Rohaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushmita Sen Opens Up Her Dating With Rohaman Related Telugu News,Photos/Pics,Images..