42 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలు ఉండగా...తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడిని పెళ్లిచేసుకోనున్న టాప్ హీరోయిన్.!   Sushmita Sen Getting Married With A Young Boy     2018-11-11   08:29:45  IST  Sainath G

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనేది పాత సామెత.. కాని ఒంటిలో ఓపిక ఉండాలే కాని ముచ్చట తీర్చుకునేందుకు వయసుతో సంబంధం ఏమిటి అంటోంది మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్. 42 ఏళ్ల ముదురు వయసులో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. తన బాయ్ ఫ్రెండ్, మోడల్ రోహ్మాన్ షాల్‌తో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ఈ అందాల సుందరి అతడితో మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీ అయ్యిందట.

42 ఏళ్ల వయసున్న సుస్మితా సేన్ ఇప్పటికే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా పిక్‌లో సుస్మితా కూతుళ్లతో పాటు రోహ్‌మన్ కూడా దర్శనమివ్వటం.. పెళ్లి వార్తలకు మరింత బలాన్నిస్తోంది.42 ఏళ్ల సుస్మిత కొన్నాళ్లుగా మోడల్ రోహ్మాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

Sushmita Sen Getting Married With A Young Boy-

తనకంటే దాదాపు 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మాన్ ఆమెకు అన్ని విధాలా నచ్చాడంట. తన దత్తత పిల్లల గురించి, ఆలోచనల గురించి ఆమె రోహ్మాన్‌కు చెప్పిందని, పెళ్లికి తనకు అభ్యంతరం లేదని అతడు అన్నాడని సన్నిహిత వర్గాలు చెప్పాయి. వచ్చే ఏడాదిలో పెళ్లి ముహూర్తం ఉంటుందన్నాయి.ఈ వీడియో కోసం క్లిక్ చేయండి