పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన సుస్మితా సేన్

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రపంచ సుందరిగా తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె తరువాత బాలీవుడ్ లో సినీ ప్రయాణం మొదలు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 Sushmita Sen Clarifies Wedding With Rohman, Bollywood, Indian Celebrities, Boll-TeluguStop.com

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తుంది.అయితే సుస్మితా సేన్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల కంటే తన రిలేషన్ విషయంలో ఎక్కువగా మీడియాని ఆకర్షిస్తుంది.

వయసులో తనకంటే 15 ఏళ్ళకి పైగా చిన్నవాడైన ఫాషన్ డిజైనర్ రోషన్ తో ఆమె ప్రేమాయణం నడిపిస్తుంది.తరుచుగా వాళ్ళిద్దరి ప్రేమని సోషల్ మీడియా సాక్షిగా బయట పెడుతూ ఉంటారు.

పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలని దత్తత తీసుకొని పెంచుతున్న సుస్మితా సేన్ ఇప్పుడు రోషన్ షాతో పీకల్లోతు ప్రేమలో ఉంది.గత రెండు సంవత్సరాలుగా రోషన్ గురించి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆయన గురించి ఆయన పిల్లలతో గడిపే క్షణాల గురించి సుస్మిత షేర్ చేస్తూ వచ్చింది.

అయితే వీరిద్దరు ప్రస్తుతం డేట్ లో ఉన్నారనే విషయం చాలా మందికి తెలుసు.మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే విషయంపై చాలా మంది నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

ఇదే విషయంపై తాజాగా ఇన్ స్టాగ్రామ్ వీడియోలో సుష్మిత సేన్ మరియు రోషన్ లు క్లారిటీ ఇచ్చారు.ఇద్దరు కలిసి లైవ్ చేసిన సమయంలో పెళ్లి ఎప్పుడు అంటూ ఒక నెటిజన్ అడిగిన సమయంలో సుష్మిత నవ్వి ఊరుకోగా రోషన్ మాత్రం త్వరలోనే అని స్పష్టం చేశాడు.

ఇంట్లో వారిని బయటి వారిని సంప్రదించిన తర్వాత పెళ్లి విషయమై ఒక నిర్ణయానికి వస్తామని పెళ్లి తేదీ విషయంలో అందరి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని త్వరలోనే నిర్ణయానికి వస్తానంటూ రోషన్ చెప్పడంతో వీరిద్దరు త్వరలోనే అధికారికంగా పెళ్లి పీటలు ఎక్కడానికి వీరు రెడీ అవుతున్నారని క్లారిటీ వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube