ప్రియుడుకు బ్రేకప్ చెప్పిన సుస్మితా సేన్..

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ గురించి, ఆమె బాయ్ ఫ్రెండ్ తో చేసే డేటింగ్ గురించి గత కొద్దీ రోజులుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అంతేకాకుండా ఈమె తరచూ సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేస్తున్న పనుల గురించి పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

 Sushmita Sen Break Up With Boy Friend Rohman Shaw, Sushmita Sen, Break Up, Rohma-TeluguStop.com

ముఖ్యంగా యోగ, ఫిట్నెస్ గురించి చేసే వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.

సుస్మితా సేన్ 2015 నుండి సినిమాల్లో నటించడం మానేసింది.

అయితే గత సంవత్సరం ఆర్య అనే వెబ్ సిరీస్ లో నటించింది.ఇందులో సుస్మితా సేన్ మంచి పవర్ ఫుల్ పాత్రలో నటించింది.

ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సుస్మితా సేన్ గత కొన్ని నెలలుగా బాలీవుడ్ సెలెబ్రిటీ రోహ్మన్ షా‌తో కలిసి సహజీవనం చేస్తుంది.

అయితే తాజాగా ఈమె ప్రియుడుతో బ్రేక్ అప్ అయ్యిందనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.అందుకు ఒక కారణం కూడా ఉంది.

Telugu Bollywood, Break, Rohman Shawl, Sushmita Sen-Movie

సుస్మితా సేన్ తన బాయ్ ఫ్రెండ్ తో గత కొన్ని నెలలుగా చేస్తున్న సహజీవనానికి స్వస్తి చెప్పినట్లే కనిపిస్తుంది.తాజాగా సుస్మిత సేన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసింది.దీనిని చూసిన వారంతా సుస్మిత సేన్ తన బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పినట్లు గుసగుసలు చెప్పుకుంటున్నారు.

సుస్మిత సేన్ తన ఇన్స్‌టాగ్రామ్‌ పేజీలో ఈ మధ్య ఒక పోస్టు పెట్టింది.

ఆ పోస్టులో ఏముందంటే.అతడు మారుతాడని మహిళలు అనుకోవడమే అసలు సమస్య.

కానీ వారు మారరుగా.ఎన్ని తప్పులు చేసిన మహిళలు మనల్ని వదిలి వెళ్లరనే ధీమా పురుషుల్లో ఉంటుంది.

అని ఒక కొటేషన్‌ ద్వారా తెలిపింది.మగవారిపై ద్వేషంతో కూడిన ఈ పోస్టును చుసిన అభిమానులు ప్రియుడితో బ్రేకప్ జరిగిందనే ఊహాగానాలకు తెరలేపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube