చిరంజీవి హెయిర్ పై ప్రయోగాలు చేసిన పెద్ద కూతురు

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంటే ఒక క్రేజ్ ఉంటుంది.ఆ ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు వస్తున్నారని ఒక వర్గం వారు విమర్శించిన, మెగా ఫ్యామిలీని అభిమానించే వారు మాత్రం చిరంజీవి గురించి గొప్పగా చెప్పుకుంటారు.

 Sushmita Konidela Hair Cut To Megastar Chiranjeevi, Tollywood, Telugu Cinema, So-TeluguStop.com

కుటుంబానికి, అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళుకి అంతగా ప్రాధాన్యత ఇచ్చి, అందరి భాగు కోరుకుంటూ తాను నిలబడి అందరిని నిలబెట్టిన గొప్ప వ్యక్తిగా ప్రశంసలు కురిపిస్తారు.అతను పొలిటికల్ గా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కాని, వ్యక్తిగత జీవితంలో, సినిమా రంగంలో ఎప్పటికి ఫెయిల్ కాలేదు.

ఫెయిల్ కారు కూడా అంటూ పొగిడేస్తూ ఉంటారు.కుటుంబ సభ్యులతో అతను ఎంత సన్నిహితంగా ఉంటారు అనే విషయాలు అప్పుడప్పుడు కొన్ని సంఘటలు రుజువు చేస్తూ ఉంటారు.

పిల్లల్ని చిరంజీవిలా ప్రేమించే తండ్రి ఉంటాడా అనిపిస్తుంది.ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఓ వీడియోను షేర్ చేసింది.ఇందులో ఆమె హెయిర్ స్టైలిస్ట్ అవ‌తారం ఎత్తింది.క‌త్తెర‌ చేత్తో పట్టుకొని మెగాస్టార్ చిరంజీవికి స్టైలిష్ గా హెయిర్ కట్ చేసింది.

లాక్ డౌన్ కారణంగా కూతురుతోనే చిరంజీవి సంతోషంగా ఆమెకి నచ్చినట్లు హెయిర్ కటింగ్ చేయించుకున్నారు.ప్ర‌స్తుతం ఈహెయిర్ కటింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

అయితే చివ‌ర్లో మెగాస్టార్ లుక్ మాత్రం చూపించ‌లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube