హీరో ఆత్మహత్య కేసు విచారణ పూర్తి, ఎవరు నింధితులు?

బాలీవుడ్‌ స్టార్‌ సుశాంత్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసును పోలీసులు చాలా సీరియస్‌గా గత నెల రోజులుగా విచారిస్తున్నారు.సుశాంత్‌ది ఆత్మహత్య అంటూ పోలీసులు నిర్థారణకు వచ్చారు.

 Sushanth Singh Rajuputh Sucide Invesigation Case Is Closed No One Is Accussed In-TeluguStop.com

అయితే ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుంది, బలవన్మరణంకు పాల్పడటం వెనుక ఎవరైనా ఉన్నారా అనేది పోలీసులు విచారించారు.దాదాపుగా 32 మందిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.

ఆయన ప్రేయసిగా ప్రచారం జరుగుతున్న రియా చక్రవర్తి, కుటుంబంలోని కొందరిని ఇంకా ఆయనతో వర్క్‌ చేసిన వారిని మరియు పని వారిని సుశాంత్‌ కేసులో ప్రశ్నించారు.

సుదీర్ఘంగా సాగిన విచారణలో పోలీసులు సుశాంత్‌ ఆత్మహత్యకు కేవలం డిప్రెషన్‌ కారణం అంటూ నిర్థారణకు వచ్చారు.

కొన్ని సమస్యలు అతడికి ఉన్నా కూడా వాటిని పెద్దవిగా భావించి జీవితాన్ని వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారు.ఎవరు కూడా ఉద్దేశ్య పూర్వకంగా సుశాంత్‌ మరణంకు కారణం కాదని పోలీసుల విచారణలో తెలియజేశారు.

కొన్ని సినిమాలు క్యాన్సిల్‌ అవ్వడంకు ఎవరో కారణం కాదని, కొన్ని విషయాలు జరిగిన మాట వాస్తవమే కాని అందుకు వారిని బాధ్యులను చేసి సుశాంత్‌ హత్య కేసులో నిందితులుగా వారిని పరిగణించడం కుదరదు అంటూ పోలీసులు పేర్కొన్నారు.

Telugu Mumbai, Sushanth, Sushanthsingh-Movie

మొత్తానికి సుశాంత్‌ ఆత్మహత్య కేసులో ఎవరిని అరెస్ట్‌ చేయడం కాని కనీసం ఎవరిపై కేసు కూడా నమోదు చేయడం కాని జరగలేదు.కుటుంబ సభ్యులు కూడా ఈ విషయమై పోలీసులను ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించడం లేదు.దాంతో ముంబయి పోలీసులు కేసును క్లోజ్‌ చేసినట్లుగా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube