సుశాంత్ కేసు దర్యాప్తు లో కీలక సమాచారం  

Sushanth Singh Rajputh Shovik - Telugu Police Investigation, Riya Chakravarthy, Shovik Chakravarthy, Sushanth Singh Rajputh

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మికంగా ఆత్మహత్య చేసుకొని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.అయితే అతడిది హత్యనా,లేదంటే ఆత్మహత్యనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తుండగా ఇప్పటికే 27 మందిని విచారించినట్లు తెలుస్తుంది.

 Sushanth Singh Rajputh Shovik

ప్రస్తుతం ఇంకా అతడి మ‌ర‌ణంపై ముంబై పోలీసుల బృందం ద‌ర్యాప్తు కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే.అయితే సుశాంత్ కేసుకు సంబంధించి పోలీసులకు ఒక కీలక సమాచారం లభించినట్లు తెలుస్తుంది.

మృతి చెందిన సుశాంత్ సింగ్, రియా చ‌క్ర‌వ‌ర్తి మంచి స్నేహితుల‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.అయితే పోలీసుల ద‌ర్యాప్తులో అనుకోని ట్విస్ట్ లభించింది.

సుశాంత్ కేసు దర్యాప్తు లో కీలక సమాచారం-General-Telugu-Telugu Tollywood Photo Image

రియా సోద‌రుడు శోవిక్ చ‌క్ర‌వ‌ర్తి సుశాంత్ సింగ్ కు బిజినెస్ పార్ట్ న‌ర్ గా ఉన్న‌ట్లు పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా గుర్తించార‌ట‌.సుశాంత్ కు సంబంధించిన ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ‌స్సు) కంపెనీ వివిడ్రేజ్ రియాలిటిక్స్ కంపెనీలో శోవిక్ చ‌క్ర‌వ‌ర్తి భాగ‌స్వామిగా ఉన్నట్లు సమాచారం.

ఈ సంస్థ 2019లో రియా చేతుల‌మీదుగానే లాంఛ్ అయిన‌ట్లు గుర్తించార‌ట పోలీసులు.అయితే రియా మాత్రం ఈ విష‌యాన్ని పోలీసులు స్టేట్ మెంట్ లో చెప్ప‌క పోవడం గమనార్హం.

రియా సోద‌రుడి వ్య‌వ‌హారాన్ని దాస్తుండ‌టంతో.సుశాంత్ మృతి కేసులో పోలీసుల‌కు కొత్త అనుమానాల‌కు తావిస్తోంది.

ఈ మేర‌కు శోవిక్ చ‌క్ర‌వ‌ర్తికి కూడా పోలీసులు స‌మ‌న్లు జారీచేసిన‌ట్లు స‌మాచారం.మరోపక్క ఇప్పటికే సుశాంత్ ఉండే ఇంటిలో దర్యాప్తు చేసిన పోలీసులకు అతడికి సంబందించిన డైరీలను స్వాధీనం చేసుకున్నారు.ఇవి ఈ కేసు దర్యాప్తు లో పోలీసులకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.ఈ వివరాలపై పూర్తి స్థాయిలో స్ప‌ష్టత రావాలంటే పోలీసుల ద‌ర్యాప్తు కంప్లీట్ అవ్వాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushanth Singh Rajputh Shovik Related Telugu News,Photos/Pics,Images..

footer-test