చనిపోయే ముందు మహేష్‌కు ఫోన్ చేసిన సుశాంత్.. రిప్లై ఇస్తే అయిపోయేది!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.కాగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనకాల ఏదైనా బలమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Sushanth Singh Called Mahesh Day Before Suicide, Sushanth Singh, Mahesh, Bollywo-TeluguStop.com

కాగా సుశాంత్ సూసైడ్ చేసుకునే ముందు రోజు ఆయన ఏమేమి చేశాడనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఇందులో భాగంగా కొన్ని కీలకమైన విషయాలు లభ్యమైనట్లు ముంబై పోలీసులు తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకునే ముందు చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాడని తెలుస్తోంది.అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు రాత్రి మహేష్‌కు ఫోన్ చేసినా, ఆయన రిప్లై ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.

కంగారు పడకండి.మహేష్ అంటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు.

బాలీవుడ్ టీవీ నటుడు మహేష్ శెట్టితో సుశాంత్ మంచి స్నేహాన్ని కొనసాగించే వాడని తెలుస్తోంది.అయితే ఆయన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కాల్‌ను లిఫ్ట్ చేయలేదట.

సుశాంత్ మరణవార్త విని చాలా దిగ్భ్రాంతికి గురయ్యానని, ఓ మంచి స్నేహితుడిని కాదు ఓ మంచి సోదరుడిని కోల్పోయానంటూ మహేష్ శెట్టి తెలిపాడు.ఏదేమైనా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

కాగా పలువురు ఆయన మృతిపై తమ తీవ్ర సానుభూతిని వ్యక్త పరిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube