ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడిని గుర్తుపట్టారా.ఇంకెవరు గత ఏడాది అభిమానులను తీరని శోకం సంద్రంలో ముంచినా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్.

 Sushanth Singh Child Hood Photo-TeluguStop.com

ఈయన తొలిసారిగా బుల్లితెరలో నటించగా ఆ తర్వాత వెండితెరపై నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

2008లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుశాంత్ సింగ్ ఎంఎస్ ధోని, చిచోరే వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించగా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Sushanth Singh Child Hood Photo-ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈయన 2019లో వరుస సినిమాలలో నటించాడు.ఇక 2020 జూన్ 14న కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ముంబైలో తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఈయన మరణం గురించి పలు అనుమానాలు ఎదురుగా ఆయన మరణం గురించి ఎన్ సి బీ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో డ్రగ్స్ కేసు కలకలం రేపింది.ఇప్పటికీ ఆయన మరణం గురించి పూర్తి వివరణ తెలియలేదు.

Telugu Bollywood, Chichhore, Chilhood Photo, Corona, Dil Bechara, Ms Dhoni Movie, Social Media, Suicide, Sushant Singh, Sushanth Childhood Photo, Sushanth First Death Anniversary Today-Movie

ఈరోజుకి సుశాంత్ సింగ్ మరణించి ఏడాది కాగా ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలు, అభిమానులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.అంత మంచి నటుడు ఈ లోకాన్ని విడిచినందుకు ఎంతో బాధ పడ్డారు.ఈరోజు ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా ఎంతోమంది అభిమానులు ఆయనను తలచుకుంటున్నారు.సోషల్ మీడియా వేదికగా ఆయనకు శాంతి తెలుపుతున్నారు.

Telugu Bollywood, Chichhore, Chilhood Photo, Corona, Dil Bechara, Ms Dhoni Movie, Social Media, Suicide, Sushant Singh, Sushanth Childhood Photo, Sushanth First Death Anniversary Today-Movie

ఇక ఈయన నటించిన దిల్ బెచారా సినిమా విడుదల కాకముందే ఈ లోకము నుండి దూరమయ్యాడు.ఇక ఈయన పేరు మీద ఈయన సన్నిహితులు ఇటీవలే కరోనా సెకండ్ వేవ్ తో ఇబ్బందులు పడుతున్న బాధితులకు తమ వంతు సహాయం చేశారు.అంతేకాకుండా ఈరోజు పలుచోట్ల ఆయన అభిమానులు తమ వంతు సహాయం చేస్తూ ముందుకు వచ్చారు.ఈయన ఆత్మ శాంతి చేకూరాలని సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

#Ms Dhoni Movie #Corona #SushanthFirst #Sushant Singh #Suicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు