నో పార్కింగ్‌లో బండి పెట్టిన సుశాంత్

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో సుశాంత్ చేసిని సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.దీంతో కాస్త గ్యాప్ తీసుకుని అల వైకుంఠపురములో సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.

 Sushanth Ichata Vaahanamulu Nilupa Raadhu Birtdhay Teaser-TeluguStop.com

అయితే ఆ సినిమాలో సుశాంత్ సెకండ్ హీరోలాగా చేశాడు.కాగా తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే లాంఛ్ చేసిన సుశాంత్, దానిని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుంది.

కాగా నేడు సుశాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఓ చిన్న టీజర్‌ను వదిలారు.ఇందులో కొత్త బైకుతో సుశాంత్ ఎంట్రీ బాగుంది.నో పార్కింగ్ బోర్డు వద్ద అతడు బండిని పార్క్ చేసే విధానం మనకు ఇందులో చూపించగా, ఆ తరువాత పలు యాక్షన్ సీన్‌లకు సంబంధించినవి చూపించారు.

సుశాంత్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube