హీరో ఆత్మహత్యతో ఆ ముగ్గురు సూపర్‌ స్టార్స్‌కు పెద్ద తలనొప్పి

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సుశాంత్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కారణంగా కొందరు స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌కు తలనొప్పిగా మారింది.ముఖ్యంగా కరణ్‌ జోహార్‌ వంటి స్టార్‌ మేకర్‌ విషయంలో వివాదం నెలకొంది.

 Sushant Suicide Made Khan's In Trouble, Aamir Khan,salman Khan,shahrukh Khan,sus-TeluguStop.com

ఈయన వల్లే కొత్త వారికి ఛాన్స్‌ లు రావడం లేదు.ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లో నటించాలని భావించే వారిని ఈయన ఎదగడనివ్వడం లేదు అంటూ ఆరోపించారు నెటిజన్స్‌.

తాజాగా సోషల్‌ మీడియాలో కొత్త ప్రచారం ఒకటి ప్రారంభం అయ్యింది.

బాలీవుడ్‌ను అంతా తామై ఏళేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఖాన్స్‌ త్రయం అయిన సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌లను బ్యాన్‌ చేయాలి అనేది కొత్త వాదన.

కొన్ని గంటల్లోనే ఈ ముగ్గురు ఖాన్స్‌ను బ్యాన్‌ చేయాలంటూ వచ్చిన హ్యాష్‌ ట్యాగ్‌ లక్షల పోస్ట్‌లను నమోదు చేసింది.ఆ హ్యాష్‌ ట్యాగ్‌ జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అయ్యింది అంటే ఆ ఖాన్స్‌ పై జనాలకు ఏ స్థాయిలో కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు.

Telugu Aamir Khan, Bollywood, Karan Johar, Salman Khan, Shahrukh Khan, Makers, S

ఈ ముగ్గురు ఖాన్స్‌ వారికి సంబంధించిన వారినే సినిమా పరిశ్రమలోకి తీసుకు రావడం నిర్మాతగా దర్శకుడిగా హీరోయిన్‌గా సంగీత దర్శకుడిగా ఇలా అందరిని కూడా వారికి ఇష్టం ఉన్న వారినే ఎంపిక చేయడం వంటి కారణాల వల్ల కొత్తగా వచ్చే వారికి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఎదగాలని ఆరాటపడే వారికి శరాఘాతం మాదిరిగా అయ్యింది.అందుకే ఆ ఖాన్స్‌ త్రయంను బ్యాన్‌ చేస్తే బాలీవుడ్‌ అంతా బాగుంటుందనేది చాలా మంది వాదన.అది ఈస్థాయిలో ఉందా అనేది తాజాగా వెళ్లడయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube