సుశాంత్ మరణానికి ముందు రియా కోట్ల రూపాయల డబ్బుని…  

Sushant Singh Raj puth, Suicide news, Rhea chakraborty, sushant singh rajput and rhea chakraborty love, Bolywood - Telugu Bolywood, Rhea Chakraborty, Suicide News, Sushant Singh Raj Puth, Sushant Singh Rajput And Rhea Chakraborty Love

ఇటీవలే బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే.అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం ఆయన అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో స్పందిస్తూ సినీ పరిశ్రమలోని కొందరు పెద్ద మనుషులు చేస్తున్నటువంటి ఆగడాలను భరించలేకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నాడు.

 Sushant Singh Rajput Rhea Chakraborty Kk Singh Crores Of Ruppes Social Media

అయితే ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి హీరోయిన్ రియా చక్రవర్తి కారణమంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే ఇందులో మృతుడి తండ్రి తెలిపిన వివరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిర్ఘాంతపోయే విషయాలను తెలుసుకున్నట్లు సమాచారం.

సుశాంత్ మరణానికి ముందు రియా కోట్ల రూపాయల డబ్బుని…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో ముఖ్యంగా పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలించగా గత మూడు నెలల్లో దాదాపుగా 45 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు రియా చక్రవర్తి ఖాతా కి ట్రాన్స్ ఫర్ చేసినట్లు కనుగొన్నారు.

దీంతో ఆమె ఫోన్ కాల్స్ కి సంబంధించిన వివరాలను కూడా సేకరించే పనిలో పడ్డారు.

ఈ విషయం తెలుసుకున్న కొందరు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు కచ్చితంగా రియా చక్రవర్తి అతడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని సోషల్ మీడియా మాధ్యమాలలో ఆరోపణలు చేస్తున్నారు.దీనికి తోడు తనపై ఫిర్యాదు చేయగానే తన కేసుని వాదించేందుకు రియా చక్రవర్తి  ఖరీదైన లాయర్ నియమించుకోవడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా రియా పై సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.కాగా ఇటీవలే తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా లైవ్ లోకి వచ్చి కచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.

#Bolywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Singh Rajput Rhea Chakraborty Kk Singh Crores Of Ruppes Social Media Related Telugu News,Photos/Pics,Images..