నా సక్సెస్ కి నెపోటిజం కారణం కాదు అంటున్న కరీనా కపూర్  

Kareena Kapoor Khan feels nepotism is overrated, Bollywood, Sushant Singh Rajput, Nepotism, Celebrity Families - Telugu Bollywood, Celebrity Families, Kareena Kapoor Khan Feels Nepotism Is Overrated, Nepotism, Sushant Singh Rajput

బాలీవుడ్ లో చాలా కాలంగా నెపోటిజం గొడవ నడుస్తుంది.సుశాంత్ మరణం తర్వాత ఈ గొడవ మరింత తారాస్థాయికి చేరుకుంది.

TeluguStop.com - Sushant Singh Rajput Nepotism Celebrity Kareena Kapoor Khan

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఎన్నో కలలతో హీరోయిన్స్ అవుదామని, హీరోలు అవుదామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారికి అవకాశాలు రాకపోవడానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి, నెపోటిజం కారణం అని చాలా మంది సెలబ్రిటీ ప్రముఖులు ఆరోపణలు చేస్తున్నారు.కంగనా లాంటి వారు ఈ విషయంలో మరో రెండు అడుగుల ముందుకి వేసి నెపోటిజంకి వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతుంది.

TeluguStop.com - నా సక్సెస్ కి నెపోటిజం కారణం కాదు అంటున్న కరీనా కపూర్-Movie-Telugu Tollywood Photo Image

అయితే సెలబ్రిటీ కుటుంబాల నుంచి హీరోలుగా, హీరోయిన్స్ గా బాలీవుడ్ లో సక్సెస్ అయిన వారు ఈ నెపోటిజం ఆరోపణలపై పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు.అయితే తాజాగా కరీనా కపూర్ మాత్రం నెపోటిజం వాఖ్యలు తనని ఎంతగా బాదిస్తున్నాయో అనే విషయాన్ని ఆమె మాటల ద్వారా బయట పెట్టింది.

కపూర్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో హీరోయిన్ అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా కరీనా కపూర్ ఎదిగింది.అయితే తాను కేవలం నెపోటిజంతోనే ఎదగలేదని, తన స్వశక్తితో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.మనం సిచ్యుయేషన్ ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించం.ఒక ప్రత్యేకమైన బ్యాగ్రౌండ్ నుండి వచ్చినవారైతే చాలు దాడి చేయాలి అనేదానికి చాలా మంది అలవాటు పడ్డారు.

***

అయితే బ్యాగౌండ్ వల్లే ఈ పేరు కీర్తి డబ్బు సక్సెస్ వచ్చాయని అనడం కరెక్ట్ కాదు.నిజాయితీగా చెప్పాలంటే నేను 21 సంవత్సరాల నా కెరీర్ కు నెపోటిజం మాత్రమే కారణం కాదు.

అది అసలు సాధ్యం కూడా కాదు.ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్స్ వారసత్వంగా వచ్చిన వారు స్టార్స్ గా నిలబడలేదు.

డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని కోరుకుంటాడు.అది వారి ఆలోచన.

అయితే దాని మీద ఎవరూ డిస్కషన్ చేయరు.బాలీవుడ్ అనేది పెద్ద ఇండస్ట్రీ కాబట్టి అందరూ దీని వైపు చూస్తారు అని చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో నేను కూడా స్ట్రగుల్ అయ్యాను.కానీ నా స్ట్రగుల్ 10 రూపాయలు జేబులో పెట్టుకొని ట్రైన్ ఎక్కి వచ్చివారిలా ఉండదు.

నాకే కాదు స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కూడా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఇబ్బందులు పడుతూ ఉండాలి అని కరీనా తన మనసులోని మాటని బయటపెట్టింది.

#SushantSingh #Nepotism #KareenaKapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Singh Rajput Nepotism Celebrity Kareena Kapoor Khan Related Telugu News,Photos/Pics,Images..