బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.సుశాంత్ మృతి అనంతరం అతను డ్రగ్స్ వాడినట్లు తేలడంతో ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ కేసు నమోదు చేసి సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లను విచారించారు.
రియా అక్టోబర్ నెల మొదటివారం బెయిల్ పై విడుదల కాగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే సుశాంత్ మృతి చెందిన చాలా నెలల తరువాత సుశాంత్ ఆత్మహత్యకు ముందు చేసిన పనుల గురించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
సుశాంత్ స్నేహితులలో ఒకరైన సిద్దార్థ్ గుప్తా ఒక ఇంటర్వ్యూలో సుశాంత్ మృతి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సుశాంత్ తన సినిమా సక్సెస్ సాధించినా, ఫ్లాప్ అయినా ఒకే విధంగా తీసుకుంటాడని.
కొత్తదనాన్ని ఎక్కువగా ఇష్టపడతాడని తెలిపారు.

ఇతరులకు ఎల్లప్పుడూ మంచి చేయాలని సుశాంత్ ఆలోచించేవాడని కానీ కొందరు మాత్రం సుశాంత్ ను తప్పుగా అర్థం చేసుకునేవారని సిద్దార్థ్ చెప్పారు.సుశాంత్ కు దైవభక్తి కూడా ఎక్కువని సిద్దార్థ్ తెలిపారు.సుశాంత్ కు తను, కౌశల్ అనే ఫ్రెండ్ ఉన్నాడని మా ఇద్దరికీ సుశాంత్ మరణానికి ఐదు రోజుల ముందు తనకు, మరో స్నేహితుడికి సుశాంత్ అధ్యాత్మికంగా ముందుకెళుతున్నట్టు సందేశం పంపాడని.
అధ్యాత్మాక చింతనకు గురైనట్లు చెప్పాడని సిద్ధార్థ్ చెప్పారు.
సుశాంత్ గతంలో ఎప్పుడూ ఆ విధంగా చెప్పలేదని.
అలా చెప్పడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని సిద్దార్థ్ అన్నారు.అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం ఊహించలేదని సిద్దార్థ్ పేర్కొన్నారు.
సుశాంత్ ను కలిసి అలా ఎందుకు పంపాడో తెలుసుకుందామని అనుకున్నానని కానీ ఊహించని విధంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సిద్దార్థ్ గుప్తా తెలిపారు.