నక్షత్రానికి సుశాంత్ పేరు పెట్టిన అభిమాని  

Sushant Singh Rajput Fan Names a Star, Tollywood, Bollywood, Indian Cinema, Celebrity Stars, B-town - Telugu B-town, Bollywood, Celebrity Stars, Indian Cinema, Sushant Singh Rajput Fan Names A Star, Tollywood

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత బాలీవుడ్ లో గత కొంతకాలంగా అతని మృతికి గల కారణాలపై చర్చ నడుస్తుంది.అదే సమయంలో సోషల్ మీడియాలో అతనిని ఫాలో అయ్యే అభిమానులు ఏదో ఒక రూపంలో అతని మీద తమ ప్రేమని చాటుకుంటున్నారు.

 Sushant Singh Rajput Fan Star Bollywood

చంద్రుడు మీద స్థలం కొన్న మొదటి ఇండియా సెలబ్రెటీ సుశాంత్ అనే విషయం అందరికి తెలిసిందే.ఖగోళం మీద అతనికి అంత ఆసక్తి ఉంది.

ఈ విషయం అతని అభిమానులకి కూడాబాగా తెలుసు.నటుడిగా మారిన తర్వాత కూడా ఆస్ట్రో ఫిజిక్స్‌పై సుశాంత్‌ అనేక అధ్యయనాలు చేశారు.

నక్షత్రానికి సుశాంత్ పేరు పెట్టిన అభిమాని-General-Telugu-Telugu Tollywood Photo Image

విశ్వంలో ఉండే తారా మండలాన్ని చూడటానికి ఖరీదైన ఓ టెలిస్కోప్‌ను కొనుగోలు చేశారు.

సుశాంత్‌ ఇష్టాలు తెలిసిన ఒక అభిమాని ఆయనకు గొప్పగా నివాళి ప్రకటించారు.

అమెరికాలో ఉంటున్న రక్ష అనే అభిమాని ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్‌ పేరు పెట్టారు.అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

సుశాంత్‌ అద్భుతమైన వ్యక్తి.అతనికి నివాళులు అర్పించడంలో కొంత ఆలస్యం చేశాను.

ఈ చీకటి ప్రపంచంలో ఆయన ఒక స్వచ్ఛమైన రత్నం లాంటివాడు.ఆయన మరింతగా మెరవాలి.

ఆయన పేరు మీద ఉన్న నక్షత్రాన్ని ఆయన టెలిస్కోప్‌తో కొనడం చాలా సంతోషంగా ఉంది.ఇక నుంచి ఆ తార మరింత ప్రకాశవంతంగా మెరువాలి.

అని రక్ష అనే అభిమాని ట్వీట్ చేశారు.విశ్వంలో ఉంటే తారల్లో ఒకటైన RA 22.121 కు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌గా నామకరణం చేశారు. ఆ మేరకు ఖగోళ శాస్త్ర సంస్థ మాకు హక్కులు కల్పించింది.

ఆ తారకు సంబంధించిన హక్కులు, కాపీరైట్స్ మాకు లభించాయి అని కూడా రక్ష పేర్కొన్నారు.

#B-Town #Celebrity Stars

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Singh Rajput Fan Star Bollywood Related Telugu News,Photos/Pics,Images..