సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు లేదు.. డ్రైవ‌ర్ సంచ‌ల‌న విష‌యాలు?  

sushant singh rajput ex driver dhirendra yadav sensational comments! sushant singh rajput, ex driver dhirendra yadav, sushant suicide case, latest news, bollywood news, reha chakravarthi - Telugu Bollywood News, Ex Driver Dhirendra Yadav, Latest News, Reha Chakravarthi, Sushant Singh Rajput, Sushant Suicide Case

బాలీవుడ్ యువ కెర‌టం సుశాంత్ సింగ్ రాజ్ ‌పూత్ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం.సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ఆయ‌న అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు.

TeluguStop.com - Sushant Singh Rajput Ex Driver Dhirendra Yadav Sensational Comments

ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న సుశాంత్.ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అన్న మిస్ట‌రీ ఇప్ప‌టికీ వీడ‌డం లేదు.ప్రస్తుతం సుశాంత్ మృతి కేసును సీబీఐ డీల్ చేస్తోంది.ఈ క్ర‌మంలోనే సుశాంత్ కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది.

మొద‌ట సుశాంత్ డిప్రెష‌న్ కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.ఆ త‌ర్వాత నెపోటిజమ్ వ‌ల్లే సుశాంత్ చ‌నిపోయాడ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శులు వ‌చ్చాయి.

TeluguStop.com - సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు లేదు.. డ్రైవ‌ర్ సంచ‌ల‌న విష‌యాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఇప్పుడు సుశాంత్ మృతి కేసులో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.సుశాంత్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి తాను డ్రగ్స్ తీసుకునేదానినని.సుశాంత్ కి కూడా ఇచ్చేదానినని ఆమె బ‌య‌ట‌పెట్టింది.

అంతేకాదు, 2016 నుంచే సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు ఉండేదని.

సుశాంత్ కి డ్రగ్ ని అలవాటు చేసింది ఓ పేరు మోసిన ఫిల్మ్ మేకర్ అని చెప్పుకొచ్చింది.అయితే తాజాగా సుశాంత్ మృతి కేసులో మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది.

రియా చ‌క్ర‌వ‌ర్తి చెప్పిన విష‌యాలు అబద్ధమని సుశాంత్ సింగ్ రాజ్ పూత్‌ మాజీ డ్రైవర్ ధీరేంద్ర యాదవ్ స్ప‌ష్టం చేశాడు.

తాజాగా సీబీఐ డ్రైవర్ ధీరేంద్ర యాదవ్‌ను విచారించ‌గా.

సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు.సుశాంత్ ఏ రోజూ డిప్రెషన్‌కి గురికాలేదని.

డ్రగ్స్ అల‌వాటు కూడా లేద‌ని చెప్పుకొచ్చాడు.అలాగే డ్ర‌గ్స్ తీసుకున్న దాఖలాలు తాను ఎప్పుడూ గమనించలేదని వివ‌రించాడు.

అంతేకాదు, తను డ్రైవర్ గా ప‌ని చేసిన సమయంలో రియా చ‌క్ర‌వ‌ర్తి సుశాంత్ లైఫ్ లోకి రాలేద‌ని చెప్పుకొచ్చాడు.కాగా,‌ ధీరేంద్ర యాదవ్ 2018 అక్టోబర్ నుంచి 2019 ఏప్రిల్ వరకు సుశాంత్ డ్రైవర్ గా పనిచేశాడు.

మ‌రి ఈ లెక్క‌న చూస్తే.రియా వ‌చ్చాకే సూశాంత్ డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డ్డాడ అన్న‌ది హాట్ టాపిక్‌గా మారింది.

#ExDriver #SushantSingh #SushantSuicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Singh Rajput Ex Driver Dhirendra Yadav Sensational Comments Related Telugu News,Photos/Pics,Images..