సుశాంత్ ఎమోషనల్ లెటర్... నేను ఆట సరిగా ఆడలేదు  

గత ఏడాది లాక్ డౌన్ కాలంలో అత్యంత విషాదకరమైన ఘటన అంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడమే అని చెప్పాలి.నటుడుగా ఎంతో భవిష్యత్తు ఉన్న హీరో, సక్సెస్ లతో బాలీవుడ్ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం యావత్ సినీ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది.

TeluguStop.com - Sushant Singh Rajput Emotional Letter Viral

అయితే మానసిక ఒత్తిడి కారణంగా, సినిమా ఇండస్ట్రీలో ఎదురైనా అవమానాలు, అలాగే వ్యక్తిగత జీవితంలో లవ్ ఫెయిల్యూర్స్ అతని మరణానికి కారణం అని పోలీసులు తేల్చేశారు.ఏది ఏమైనా అతను చనిపోవడం మాత్రం నిజంగా విషాదకరం అని చెప్పాలి.

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం బయటకి వచ్చి ఆ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి జైలు శిక్ష కూడా అనుభవించింది.ఇప్పుడు అంతా నార్మల్ అయిపొయింది.

TeluguStop.com - సుశాంత్ ఎమోషనల్ లెటర్… నేను ఆట సరిగా ఆడలేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇలాంటి సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన జీవితం గురించి రాసుకున్న ఒక లెటర్ బయటపడింది.

అందులో ఎమోషనల్ గా తన మనసులోనే బాధని సుశాంత్ బయటపెట్టినట్లు ఉంది.

సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ఈ లెటర్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఈ లెటర్ లో ఏముందంటే… జీవితంలో ఇప్పటికే ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఈ మొదటి 30 ఏళ్లను ప్రత్యేకంగా మలుచుకునేందుకు చాలా ప్రయత్నించాను.ఇందుకోసం నా ప్రతి పనిలో బెస్ట్ గా ఉండాలని కోరుకున్నాను.

అలాగే టెన్నిస్ స్కూల్ చదువు ర్యాంక్స్లో మొదటి స్థానంలో ఉండాలనుకున్నాను.అయితే ప్రతి కోణాన్ని అలా చూడటం వల్ల నేను అసంతృప్తికి లోనయ్యేవాడిని.

నాకు మంచి జరిగినప్పుడు మాత్రం ఆట తప్పుగా ఆడానని గ్రహించాను.ఎందుకంటే నేనేంటో తెలుసుకోవడానికే ఆట ఉంది అంటూ సుశాంత్ తనలోనే భావోద్వేగాల్ని లెటర్ లో అక్షరాల రూపంలో రాసుకొచ్చాడు.

ప్రస్తుతం సుశాంత్ రాసిన ఈ లేఖ చాలామందిని కదిలిస్తోంది

.

#Swetha Singh #EmotionalLetter #SushantSingh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు