ట్రైలర్‌లో చెప్పింది నిజజీవితంలో పాటించని సుశాంత్  

Sushant Singh Rajput Dil Bechara Trailer Talk, Sushant Singh Rajput, Dil Bechara, Trailer, Bollywood News - Telugu Bollywood News, Dil Bechara, Sushant Singh Rajput, Trailer

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడటంతో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన సుశాంత్ తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని మృతి చెందాడు.

 Sushant Singh Rajput Dil Bechara Trailer Talk

కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బిచారా’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ప్రస్తుతం థియేటర్స్ మూతపడటంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.
కాగా ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఈ ట్రైలర్ చూస్తే సుశాంత్ ఫ్యాన్స్ కంటనీరు పెట్టడం ఖాయం.చాలా ఫీల్ గుడ్ చిత్రంగా ‘దిల్ బిచారా’ తెరకెక్కడంతో సుశాంత్ ఫ్యాన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు.ఇక ఈ ట్రైలర్‌ను చూస్తున్నంతసేపు సుశాంత్ సింగ్‌ను చూస్తూ ఉండిపావడం ఖాయం.

అటు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా ఈ ట్రైలర్‌కు బాగా ప్లస్ పాయింట్ అయ్యింది.

ట్రైలర్‌లో చెప్పింది నిజజీవితంలో పాటించని సుశాంత్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ ట్రైలర్‌లో సుశాంత్ చెప్పే ఓ డైలాగ్ మనస్సుకు తగులుతుంది.

‘ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చావాలో మనం డిసైడ్ చేయలేం’ అనే డైలాగు సుశాంత్ చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.సినిమాలో చెప్పిన డైలాగును ఆయన నిజజీవితంలో ఆచరించలేకపోయాడని పలువురు ఫీల్ అవుతున్నారు.

ఇక ఈ సినిమాను డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీలో అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#Dil Bechara #Trailer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Singh Rajput Dil Bechara Trailer Talk Related Telugu News,Photos/Pics,Images..