భయంతో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడా?  

sushant singh rajput chatting with his sister, Sushanth Singh Rajputh, cbi, Drugs Case, Bollywood, Nepotisam, Kangana Ranauth, National Media, - Telugu Bollywood, Bollywood News, Kangana, Sushanth, Telugu News

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి సంబంధించిన అనుమానాలు ఇంకా నివృత్తి అవ్వడం లేదు.ఈ కేసులో సీబీఐ విచారణ చేస్తున్నప్పటికీ ఇంకా ఎలాంటి అప్డేట్ మాత్రం రావడం లేదు.

TeluguStop.com - Sushant Singh Rajput Chatting With His Sister

ప్రతి రోజు ఏదో ఒక విషయం వెలుగులోకి వచ్చి అనేక అనుమానాలకు తెర లేపుతూనే ఉంది.తాజాగా సుశాంత్ సోదరి బయట పెట్టిన ఒక చాటింగ్ ఆయన మృతికి అనుమానాలు మరింతగా పెంచుతున్నాయి.

సుశాంత్ మృతి చెందడానికి కొన్నిరోజుల ముందు ఆయన సోదరితో చాటింగ్ చేయడం జరిగింది.

TeluguStop.com - భయంతో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ చాటింగ్ లో తనకు భయంగా ఉందని తనను ఎవరైనా చంపేస్తారేమో అని అనుమానంగా ఉందని, తనపై ఏదో కుట్ర జరుగుతుంది అనే అనుమానం ఉందని చెప్పడం జరిగిందట.

అలా చెప్పిన కొన్ని రోజులకే సుశాంత్‌ మృతి చెందడం సంచలనంగా మారింది.ఇప్పుడు ఆ చాటింగ్‌ విషయంలో సిబిఐ వాళ్ళు లోతుగా ఎంక్వయిరీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆ సమయంలో సుశాంత్‌ ను భయపెట్టింది ఎవరు, ఆయనకు ఎవరో ఎందుకు చంపేస్తారేమో అనే అనుమానం కలిగింది అనే కోణంలో సీబీఐ ఎంక్వైరీ జరుగుతున్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.సుశాంత్ మృతి కేసు తో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.

దాంతో సుశాంత్‌ కేసు మరుగున పడుతుందేమో అనే ఆందోళనలో ఆయన అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఉన్నారు.కానీ సీబీఐ మాత్రం సుశాంత్ కేసును సీరియస్ గా తీసుకొని విచారణ చేస్తున్నట్లు గా చెప్పుకొచ్చింది.

సుశాంత్‌ మృతి తర్వాత బాలీవుడ్‌ లో నెపొటిజం కు సంబంధించిన ఆరోపణలు కొందరు ఎదుర్కొంటున్నారు. కంగనా అయితే సుశాంత్‌ మృతికి పూర్తిగా బాలీవుడ్‌ మాఫియా కారణం అంటూ ఆరోపిస్తుంది.

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ వారికి ఈ మృతితో సంబంధం లేదు అన్నట్లుగా సీబీఐ ఎంక్వౌరీలో వెళ్లడి అయ్యిందని జాతీయ మీడియా కథనాలు వినిపిస్తున్నాయి.ఆయన మృతికి ప్రత్యక్షంగా ఎవరు కారణం అయ్యి ఉండరు అంటూ ఇప్పటికే ముంబయి పోలీసులు తేల్చారు.

సీబీఐ ఈ కేసులో చివరకు ఎలాంటి రిపోర్ట్‌ ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

#Sushanth #Kangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Singh Rajput Chatting With His Sister Related Telugu News,Photos/Pics,Images..