సుశాంత్‌ కేసులో కీలక పరిణామం  

Bollywood Hero Sushant Singh Rajput Post Mortem Report, Sushant Singh Rajput ,Drugs Case, Rhea Chakraborty, NCB Officials - Telugu Bollywood, Bollywood Hero Sushant Singh Rajput Post Mortem Report, Drugs Case, Ncb Officials, Rhea Chakraborty, Sushant Singh Case, Sushant Singh Rajput, Sushanth, Telugu News

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ కేసును ఎంక్వౌరీ చేస్తున్న సీబీఐకి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి.ముందుగా ఈ కేసుకు డ్రగ్స్‌ రాకెట్‌ కు సంబంధం ఉందని గుర్తించారు.

TeluguStop.com - Sushant Singh Rajput Case Postmortem Report

సుశాంత్‌ ప్రియురాలు డ్రగ్స్‌ ను కొనుగోలు చేసినట్లుగా వెళ్లడి అవ్వడంతో లోతుగా విచారించగా ఆమె సుశాంత్‌ కోసం కొనుగోలు చేసినట్లుగా ఒప్పుకుంది.దాంతో మొదలైన డ్రగ్స్‌ కేసు బాలీవుడ్‌ లో ప్రముఖులను విచారించే వరకు వెళ్లింది.

దీపిక పదుకునే, సారా అలీ ఖాన్‌, శ్రద్దా కపూర్‌ మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు.ఒక వైపు ఎన్‌ సీ బీ వారు మరో వైపు సీబీఐ వారు విచారణ చేస్తున్నారు.

TeluguStop.com - సుశాంత్‌ కేసులో కీలక పరిణామం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఈ కేసులో కీలక పరిణామంను సీబీఐ వారు గుర్తించినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సుశాంత్‌ మృత దేహంను పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో మొదట తప్పుడు సమాచారం ఇచ్చారట.

అసలు విషయం ఏంటీ అంటే సుశాంత్‌ మృతి చెందిన సమయంలో డ్రగ్స్‌ సేవించి ఉన్నాడు అంటూ సీబీఐ వారు గుర్తించారట.ఆ విషయాన్ని మహా ప్రభుత్వం ఎందుకు దాచింది అనే విషయాన్ని సీబీఐ వారు ఎంక్వౌరీ చేసే అవకాశం ఉంది.

మొత్తానికి సుశాంత్‌ మృతి చెందడానికి ముందు కూడా డ్రగ్స్‌ తీసుకున్నాడని ఆయనకు డ్రగ్స్‌ సరఫరా లేకపోవడం వల్లే ఆత్మ హత్య చేసుకున్నాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.

సుశాంత్‌ కు డ్రగ్స్‌ అలవాటు లేదు అని రియా చక్రవర్తి ఆ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సుశాంత్‌ కేసులో ఆయన గురించి ముందు ముందు మరెన్ని విషయాలను వినాల్సి వస్తుందని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#Sushanth #SushantSingh #Drugs Case #NCB Officials #BollywoodHero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Singh Rajput Case Postmortem Report Related Telugu News,Photos/Pics,Images..