సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు... క్లారిటీ ఇచ్చిన సీబీఐ

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే.అతను మానసిక ఒత్తిడితో చనిపోయాడని ముంబై పోలీసులు ముందుగా పేర్కొన్నారు.

 Sushant Singh Rajput Case, Bollywood, B-town, Mumbai, Bollywood Cinema, Rhea Cha-TeluguStop.com

అయితే సుశాంత్ మృతిలో ఏదో మిస్టరీ ఉందని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని కుటుంబం వాదించింది.అలాగే అతను ఎలాంటి మానసిక ఒత్తిడితో లేడని,చక్కగా ఉండేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అలాగే ఒక వేళ ఆత్మహత్య చేసుకొని ఉన్న ఎవరో దానికి ప్రేరేపించి ఉంటారని ఆరోపించారు.కొంత మంది మరో అడుగు ముందుకి వేసి సుశాంత్ ని ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కూడా సంచలన వాఖ్యలు చేశారు.

దీంతో సుశాంత్ మృతి అనేది బాలీవుడ్ లో సంచలనంగా మారింది.సుశాంత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ కేసు విచారణలోకి సీబీఐ ఎంటర్ అయ్యింది.

అప్పటి నుంచి ఆయన మరణపై అన్ని కోణాలలో విచారణ చేపట్టారు.చాలా మందిని విచారించారు.

చివరికి కేసుపై విచారణ జరిపిన సిబిఐ బృందం ఫైనల్ గా సుశాంత్ ది ఆత్మహత్యే అని తేల్చి చెప్పారు.తాము హత్యా కోణంలోనే విచారణ చేసినప్పటికీ వారికి అదే హత్యే అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని సుశాంత్ మానసికంగా వేదనకు గురయ్యే చనిపోయాడని చెప్పుకొచ్చారు.

దీంతో ఎన్ని రోజులుగా అభిమానుల్లో ఉన్న సందేహాలకు తెరపడినట్లు అయ్యింది.అయితే అంతగా అతను మానసిక వేదనకి గురి కావడానికి గల కారణాలు ఏంటి, వ్యక్తిగత కారణాలతోనే మానసిక ఒత్తిడికి గురయ్యాడా, లేక ఆర్ధిక, సినీ సంబంధ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు సీబీఐ విచారణ సాగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube