సుశాంత్ ది ముమ్మాటికి హత్యే అంటున్న మాజీ అసిస్టెంట్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీలో రోజుకొక కొత్త చిక్కు వచ్చి పడుతుంది.ఈ కేసు విచారణ బాధ్యతలు కేంద్రం సీబీఐకి అప్పగించింది.

 Sushant Singh Rajput Was Murdered With His Pet Dog Belt, Ankit Acharya, Rhea Cha-TeluguStop.com

ఇక సిబీఐ కూడా సుశాంత్ కేసు విచారణ మొదలు పెట్టింది.మరో వైపు ఈడీ కూడా సుశాంత్ బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బులు ఎలా మాయం అయ్యాయి అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

అయితే ఈ విచారణలో అందరి వెళ్ళు సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి వైపు చూపిస్తున్నాయి.సుశాంత్ దగ్గర పని చేసిన మాజీ పనివాళ్ళు అందరూ కూడా రియా వచ్చిన తర్వాతనే అతనిలో మార్పు వచ్చిందని, అన్నింటికీ రియానే కారణం అని బలంగా చెబుతున్నారు.

అయితే ఈ కేసుని పూర్తిగా విచారించకుండా ముంబై పోలీసులు ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేశారు అనేది కూడా అంతుబట్టని విషయంగా ఉంది.ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ సన్నిహితుడు అతని మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య సంచలన వాఖ్యలు చేసి మరిన్ని అనుమానాలు తెరపైకి తీసుకొని వచ్చాడు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ సుశాంత్ గురించి నాకు బాగా తెలుసు.ఇది ఆత్మ‌హ‌త్య అంటే నేను న‌మ్మ‌ను.ఖ‌చ్చితంగా హత్యే.ఒక‌వేళ సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని అనుకున్నా అతని మెడ‌పై యూ ఆకారంలో మార్క్ ఉండాలి.

కానీ ఎవ‌రైనా కొట్టిన‌పుడు, గొంతు నులిమి చంపితేనే మృతుడి మెడ చుట్టూ వృత్తాకారంలో గుర్తులుంటాయన్నారు.సుశాంత్ మెడపై అలాంటి గుర్తులే ఉన్నాయి అని అంకిత్ పేర్కొన్నాడు.

ఒక‌వేళ ఆత్మ‌హ‌త్య అయితే క‌ళ్లు తేలేసిన‌ట్టు, నాలుక బ‌య‌ట‌కొస్తుంది.నోటి నుంచి నుర‌గ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

కానీ ఇలాంటి ఏమి లేవ‌ని ఆయ‌న అన్నారు.కాబ‌ట్టి సుశాంత్ ది ఖచ్చితంగా హ‌త్యేన‌ని అంకిత్ ఆచార్య ఆరోపిస్తున్నాడు.

ఈ కేసులో పార‌ద‌ర్శ‌కంగా విచార‌ణ జ‌రిపి, నిందితుల‌కు ఉరిశిక్ష వేయాల‌ని డిమాండ్ చేశాడు.ఇతని ఆరోపణల నేపధ్యంలో సుశాంత్ ని చంపాల్సిన అవసరం ఇప్పుడు ఎవరికీ ఉంది.

అసలు అతనిని చంపితే వచ్చే లాభం ఏంటి అనే కోణంలో కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.మరి అతని మరణం మిస్టరీగానే మిగిలిపోతుందా లేదంటే విచారణలో అన్ని నిజాలు బయటకి వస్తాయా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube