సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాశంగా మారింది.ఈ కేసు ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరంకి కూడా కారణం అయ్యింది.
మరో వైపు ఈ కేసు విచారణలోకి సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. సుప్రీం కోర్టు అనుమతులతో సీబీఐ సుశాంత్ కేసు విచారణకి సిద్ధం అయ్యింది.
ఈ కేసులో మెయిన్ ముద్దాయిగా అందరి వెళ్ళు రియా చక్రవర్తి వైపు చూపిస్తున్నాయి.సుశాంత్ కుటుంబం రియాపైనే ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు.
ఇప్పుడు రియా కూడా సుశాంత్ ఫ్యామిలీపై విమర్శలు చేయడం మొదలు పెట్టింది.ఈ వ్యవహారం ఇలా సాగుతూ ఉండగానే బాలీవుడ్ లో కూడా నెపోటిజం చుట్టూ సుశాంత్ ఆత్మహత్య ఇష్యూని కొందరు తిప్పుతున్నారు.
ముఖ్యంగా కంగనా రనౌత్ అయితే నెపోటిజం వ్యతిరేక వర్గాన్ని తానే లీడ్ చేస్తున్నట్లు అవకాశం దొరికిన ప్రతీ సారి సుశాంత్ ఆత్మహత్యని పైకి చూపిస్తూ స్టార్ కిడ్స్ పై విమర్శలు చేస్తుంది.
సుశాంత్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ముగ్గురుతో ప్రేమ వ్యవహారం నడిపారు అనే విషయం బాలీవుడ్ లో అందరికి తెలుసు.
అయితే సైఫ్ ఆలీఖాన్ కూతురు సారాతో కూడా సుశాంత్ కొంతకాలం ప్రేమలో ఉన్నాడనే విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.ఈ విషయాన్ని సారా అలీఖాన్, సుశాంత్ ఇద్దరూ ప్రేమించుకున్నారని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
శామ్యూల్ ఈ విషయం గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కేదార్ నాథ్ చిత్రంలో సుశాంత్, సారా ఇద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే.ఈ చిత్రం సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు.సినిమా ప్రమోషన్ సమయంలో సుశాంత్, సారా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అని తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
సుశాంత్ తదుపరి సినిమా సోన్ చిరియా ప్లాప్ అవ్వడంతో సారా అతడిని విడిచి వెళ్లిపోయిందని, ఈ విషయం తనను ఆశ్చర్యపరిచిందని శామ్యూల్ చెప్పాడు.ఈ పోస్ట్ ని కంగనా తనకి అనుకూలంగా మార్చుకొని నెపోటిజంని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది.
సారా ఆలీఖాన్ పై నేరుగా విమర్శలు చేసింది.మరి సారా ఆలీఖాన్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.