ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..?  

guess these childhood bollywood hero Sushant singh raj put, Bollywood, childhood photos, - Telugu Bollywood, Childhood Photos, Sushant Singh Raj Put

భారత క్రికెట్ ఆటలో ఎనలేని సేవలు అందించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన “ఎంఎస్ ధోని” చిత్రంలో ఎంఎస్ ధోని పాత్రలో చక్కగా ఒదిగిపోయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న  “స్వర్గీయ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్” గురించి దేశ వ్యాప్తంగా తెలియని వారుండరు.అయితే ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

 Sushant Singh Raj Put Childhood Photos Asta Rishitha Ms Dhoni

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బీహార్ రాష్ట్రంలో 1986 వ సంవతసరంలో జనవరి 21వ తారీఖున జన్మించాడు.

తన విద్యాభ్యాసం అంతా బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా లో జరిగింది.దీంతో సినిమా అవకాశాల కోసం బాలీవుడ్ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి ఎన్నో కష్టాలు అనుభవించాడు అంతేకాక తిండి లేని రాత్రులు కూడా గడిపాడు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..-Latest News-Telugu Tollywood Photo Image

ఆ తరువాత కష్ట పడి “అష్టా-రిషిత” అనే సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకున్నాడు.దీంతో బుల్లి తెరకు హీరోగా పరిచయం అయినప్పటికీ వెండి తెరపై కనిపించాలనే ఆశ చావలేదు.

దాంతో ఒక పక్క ఈ ధారావాహికలలో నటిస్తూనే మరో పక్క సినిమా అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు.

ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన “కాయ్ పో చే” అనే చిత్రంలో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నాడు.

ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోవడంతో ఇక వరుస సినిమాలు అవకాశాలు క్యూ కట్టాయి.దీంతో ధారావాహికలకు స్వస్తి చెప్పి పూర్తిగా తన సినిమా కెరీర్ పై దృష్టి సారించాడు.

ఈ క్రమంలో పీకే, ఎమ్మెస్ ధోని, కేదార్ నాథ్, చిచోర్, దిల్ బేచారా తదితర చిత్రాలలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.

ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయి.

అంతేగాక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి కూడా గుర్తింపు తెచ్చాయి.అయితే ఇటీవలే  మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సొంత నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Singh Raj Put Childhood Photos Asta Rishitha Ms Dhoni Related Telugu News,Photos/Pics,Images..