సుశాంత్ మృతి పై వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు!

బాలివుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన ఎంతగా అందరినీ కలచివేసిందో తెలిసిందే.అతడు మృతి చెంది 18 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఆయన అభిమానులు,సన్నిహితులు మాత్రం ఆ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

 Sushant Sing Rajput Wanted To Save Ex Manager Disha Salian, Sushant Sing Rajput,-TeluguStop.com

అతడిది ఆత్మహత్య కాదు,హత్య అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టిమరీ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు.ఈ క్రమంలో రోజుకో కొత్త విషయాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

నెపోటిజం వల్లే సుశాంత్ ఆత్మహత్య అని కొందరు అంటుంటే,మరికొందరు మాత్రం అతడిది ఆత్మహత్య కాదు హత్య అని అంటున్నారు.ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా లో ఒక కొత్త అంశం తెరమీదకు వచ్చింది.

ఈ కేసుకు సంబంధించి తాజాగా సూరజ్ పంచోలి పేరు వెలుగులోకి వస్తుంది.

సుశాంత్ వద్ద మేనేజర్ గా పనిచేసి సరిగ్గా సుశాంత్ మరణానికి ఐదు రోజుల ముందు సూసైడ్ చేసుకున్న దిశా సెలైన్ విషయంలో సుశాంత్ కు సూరజ్ పంచోలి కి మధ్య చిన్న ఇష్యూ జరిగిందని,ఈ క్రమంలో బాలీవుడ్ బిగ్ బాస్ సల్మాన్ రంగంలోకి దిగి సుశాంత్ కు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆ ఘటన చోటుచేసుకున్న తరువాతే పలు నిర్మాణ సంస్థలు సుశాంత్ ను బ్యాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఇక తాజాగా సుశాంత్‌కి, సూరజ్‌కి ఎక్కడ గ్యాప్‌ వచ్చిందన్న విషయం గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సుశాంత్‌ ఆత్మహత్యకు ఐదు రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్‌ దిశా సెలైన్ కూడా బలవన్మరణం చేసుకున్న విషయం తెలిసిందే.

Telugu Cbi, Disha Salian, Dishasalian, Managerdisha, Salman Khan, Shekhar Suman,

మలాద్‌లో 14వ ఫ్లోర్ నుంచి దూకి దిశా ఆత్మహత్య చేసుకుంది.కాగా దిశా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సుశాంత్‌ ఆమెకు అండగా నిలిచారని, ఈ క్రమంలోనే సూరజ్‌తో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న కథనం ప్రకారం.

సూరజ్‌, దిశా రిలేషన్ షిప్ లో ఉన్నారని ఈ క్రమంలోనే దిశా గర్భం దాల్చిందని, అయితే గర్భాన్ని తొలగించుకోవాలని సూరజ్‌, దిశాకు చెప్పగా.ఆమె ససేమిరా అందట.

ఈ విషయంలోనే దిశాకు సుశాంత్‌ మద్దతివ్వడం తో ఈ విషయం తెలిసిన సల్మాన్‌, సూరజ్‌కి దూరంగా ఉండాలి అంటూ సుశాంత్‌కి సూచించారట.అంతేకాదు ఈ విషయాన్ని సుశాంత్.

రియాకు, తన స్నేహితుడు సందీప్‌కి కూడా చెప్పినప్పుడు వారు కూడా నోరు మూసుకొని ఉండమని అతడిని హెచ్చరించారట.దానికి తోడు ఇటీవల సీనియర్ నటుడు,టెలివిజన్ హోస్ట్ ఆయిన శేఖర్ సుమన్ కూడా నెల రోజుల వ్యవధిలో సుశాంత్ 50 సిమ్ కార్డులు మార్చారు అంటూ వివరించి సీబీఐ దర్యాప్తు నిర్వహించాలి అని కోరడం ఇలా అన్ని చేరి సోషల్ మీడియాలో భిన్న కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

కాగా మరోపక్క సుశాంత్‌ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ఇప్పటికే 28 మందిని విచారించగా, మరి కొంతమందికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు వారిని కూడా విచారించనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube