సుశాంత్‌కు రిప్‌ చెప్తేనే బాధపడ్డట్లు, అభిమానం ఉన్నట్లా?

సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడంపై బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు చాలా మంది స్పందించారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్‌ ఐ పీ (రిప్‌) అంటూ పోస్ట్‌ చేశారు.

 Sushant Rajput,social Media,viral,kriti-sanon,rip,bollywood-TeluguStop.com

ఎంతో మంది సెలబ్రెటీలు స్టార్స్‌ ఫ్యాన్స్‌ సామాన్యులు ప్రముఖులు రిప్‌ పోస్ట్‌ చేసినా కూడా సుశాంత్‌ మాజీ లవర్‌ అయిన కృతి సనన్‌ మాత్రం పోస్ట్‌ చేయలేదు.కృతి సనన్‌ తో పాటు రియా చక్రవర్తి కూడా సోషల్‌ మీడియా ద్వారా స్పందించలేదు.

సుశాంత్‌ మరణంపై స్పందించని కారణంగా కృతి సనన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.చనిపోయిన వ్యక్తి గురించి కనీసం స్పందించని కృతి సనన్‌ ఆడదేనా అంటూ కొందరు ట్రోల్స్‌ చేశారు.

అయితే సుశాంత్‌ అంత్యక్రియల్లో కృతి సనన్‌ పాల్గొనడంతో అంతా నోరు మూసుకున్నారు.ట్రోల్స్‌ చేసిన వారే ఆమెను అభినందిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు.ఈ సందర్బంగా కృతి సనన్‌ స్పందిస్తూ తనను ట్రోల్స్‌ చేసిన వారికి సరైన సమాధానం చెప్పింది.

Telugu Bollywood, Kriti Sanon, Sushant Rajput-Latest News - Telugu

నన్ను మొన్నటి వరకు ట్రోల్స్‌ చేసిన వారు ఒక్కసారిగా నాపై ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యంగా ఉంది.ఇందతా చూస్తేంటే సోషల్‌ మీడియా అనేది పూర్తిగా ఫేక్‌.ఇక్కడ అబద్దాలు తప్ప మరేమి లేవనిపిస్తుంది.

సోషల్‌ మీడియాలో రిప్‌ అని పెట్టినంత మాత్రాన చనిపోయిన వ్యక్తి అంటే గౌరవం అభిమానం ఉన్నట్లుగా పరిగణిస్తారా అంటూ ప్రశ్నించింది.రిప్‌ పోస్ట్‌ చేసిన వారిలో ఎంత మందికి చనిపోయిన వ్యక్తి అంటే అభిమానం ఉంది.

వారిలో ఎంత మంది అతడి మరణంకు బాధపడ్డారో చెప్పగలరా అంటూ పోస్ట్‌ చేసింది.కృతి సనన్‌ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube