సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.బాలీవుడ్లో ఉన్న నెపొటిజం కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని, సినిమాల్లో ఆఫర్లు వచ్చినట్లు వచ్చి చేజారుతున్న కారణంగా సుశాంత్ డిప్రెషన్‌కు వెళ్లి ఉంటాడు అనేది కొందరి వాదన.
కాని కొందరు మాత్రం ఆయన ప్రేమలో మళ్లీ విఫలం అవ్వడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వారి అనుమానాలకు బలం చేకూర్చేలా సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.
కొడుకు మరణించిన తర్వాత మొదటి సారి కేకే సింగ్ మీడియా ముందు మాట్లాడాడు.ఈ సందర్బంగా కేకే సింగ్ ఆసక్తికర విషయాన్ని వెళ్లడి చేశాడు.తనతో చివరి సారి మాట్లాడిన సమయంలో సుశాంత్ పెళ్లి గురించి ప్రస్తావించాడు.ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పాడట.
వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లుగా కూడా తండ్రితో సుశాంత్ అన్నాడట.
సుశాంత్ ప్రేమ విషయం గురించి మీకు తెలుసా అంటూ కేకే సింగ్‌ను ప్రశ్నించగా ఆ విషయాలపై తనతో ఎప్పుడు సుశాంత్ చర్చించలేదు.రియా చక్రవర్తితో ప్రేమ విషయంలో కూడా తనకు ఎలాంటి విషయం తెలియదు అంటూ కేకే సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పిన సుశాంత్ ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం ఏంటీ అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
రియా చక్రవర్తి ప్రేమలో అతడిని మోసం చేసిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.