సూర్యాపేట రహదారి మూసివేత.. కారణం ఇదే.. !

సూర్యాపేట మున్సిపాలిటీ కేంద్రంలోని దురాజ్ పల్లి లో మొదలైన జాతర.కాగా తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా చెప్పబడే పెద్దగట్టు జాతర యాదవుల ఆట పాటలతో మొదలవుతుందట.

 Suryapeta Road Closure This Is The Reason, Hyderabad, Vijayawada, National Highw-TeluguStop.com

ఇక్కడ యాదవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ జాతరకి, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పెద్దగట్టుకు తరలిరావడం విశేషం.

అదీగాక తెలంగాణలో మేడారం తరువాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు జాతర గుర్తింపు పొందిందట.

ఇకపోతే నేటి నుంచి ఈ జాతర మొదలైన నేపథ్యంలో, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించారు.ఈ క్రమంలో సూర్యాపేట మీదుగా మరో ఐదు రోజుల పాటు వాహనాలను అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.

ఈ జాతర ముగిసే వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారు, నార్కట్ పల్లి, అద్దంకి రహదారి మీదుగా మిర్యాలగూడ చేరుకుని, అక్కడి నుంచి హుజూర్ నగర్, కోదాడ మీదుగా ప్రయాణించాల్సి వుంటుందని అధికారులు స్పష్టం చేశారు.కాగా, ఐదు రోజుల పాటు సాగనున్న ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube