ఆ తల్లి కన్నీటికి కరిగిన దేవుడు, ఆమె కొడుకును బతికించాడు (సూర్యాపేటలో బ్రెయిన్‌డెడ్‌ కుర్రాడు లేచాడు)  

Suryapet Boy Declared Brain Dead But Back To Life While-suryapet Boy Declared Brain Dead,telugu Viral News Updates,viral In Social Media

ఒక తల్లి తన కొడుకు కోసం చేసిన పోరాటం సఫలం అయ్యింది. చనిపోయాడు అంటూ డాక్టర్లు చెప్పినా కూడా ఆ తల్లి చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన కుర్రాడి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు..

ఆ తల్లి కన్నీటికి కరిగిన దేవుడు, ఆమె కొడుకును బతికించాడు (సూర్యాపేటలో బ్రెయిన్‌డెడ్‌ కుర్రాడు లేచాడు)-Suryapet Boy Declared Brain Dead But Back To Life While

అలాంటి సమయంలో ఆ తల్లి ప్రార్థనలు విన్న దేవుడు ఆమె మెర ఆలకించాడు. 14 ఏళ్ల క్రితమే భర్తను పోగొట్టుకున్న ఆమె ఉన్న ఒక్కగానొక్క కొడుకు పోతే చనిపోవడం తప్ప మరేం లేదు. కొడుకు లేకుండా జీవితం లేదని బతుకుతున్న ఆమెను దేవుడు కనికరించి కొడుకును బతికించాడని జనాలు అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… సూర్యాపేట జిల్లా కేంద్రంకు కూత వేటు దూరంలో ఉండే గ్రామం పిల్లలమర్రి. ఆ గ్రామానికి చెందిన గంధం సైదమ్మ భర్త 14 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుండి కూడా ఉన్న ఒక్కగానొక్క కొడుకు కిరణ్‌ ను కంటికి రెప్పలా చూసుకుంటుంది.

కొడుకు పెరిగి పెద్ద వాడు అయితే తనకు ఆసరాగా నిలుస్తాడని అతడిని చదివిస్తూ ఉంది. డిగ్రీ చదివే కిరణ్‌ సూర్యపేట నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో హైదరాబాద్‌ హాస్పిటల్‌కు తరలించారు..

అక్కడ చాలా రోజుల వరకు చికిత్స చేసినా ఫలితం లేకపోయిందని డాక్టర్లు తేల్చి చెప్పారు. వెంటిలేటర్‌పై ఉన్న అతడు దాన్ని తీసేస్తే చనిపోతాడని, ఇక తీసేసి ఇంటికి తీసుకు వెళ్లమని డాక్టర్లు సూచించారట.

ఆమెకు కొడుకును వెంటిలేటర్‌ తీయడం ఇష్టం లేదు. ఆంబులెన్స్‌లో వెంటిలేటర్‌ ఏర్పాటు చేసి పిల్లలమర్రి తీసుకు వచ్చారు.

అక్కడ వెంటిలేటర్‌ తొలగించారు. దాంతో అతడు చనిపోతాడని అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులు వచ్చారు..

శ్రద్దాంజలి అంటూ ప్లెక్సీలు కొట్టి ఊరంతా పెట్టారు. అప్పుడే ఆ తల్లికి ఇంకా ఆశ చావక కొడుకు వద్ద పడి ఏడుస్తూ ఉన్న సమయంలో ఊపిరి తీసుకుంటున్నట్లుగా అనిపించింది. దాంతో వెంటనే ఆర్‌ఎంపీని పిలిచి చూపించగా చనిపోలేదని చెప్పాడు.

అక్కడ నుండి సూర్యాపేటకు తరలించారు. ప్రస్తుతం కిరణ్‌ బాగానే ఉన్నాడు. అతడు కూర్చుని పాలు తాగడంతో పాటు అమ్మ అంటూ పిలుస్తున్నాడు.