స్తంభంలో సూర్య యంత్రం ఉన్న ఆలయం ఎక్కడుందో తెలుసా?

సాధారణంగా యంత్రాలు రాగి పలకపైన, లేదా వెండి పలకల పైన ప్రచురించబడతాయి.కానీ తమిళనాడు రాష్ట్రంలో పళని లో ఉన్న అతిపురాతన సూర్య దేవాలయంలో స్తంభంపై సూర్య యంత్రం 9 చతురస్రాల తో నిర్మించబడి ఉంది.

 Suryayantram In Tamil Nadu Temple Surya Yantram, Tamil Nadu, Temple, Hindu Beli-TeluguStop.com

ఈ స్తంభాన్ని ఇటీవలే పునర్నిర్మాణం చేశారు.ఈ తొమ్మిది చతురస్రాలు లో ప్రతి చదరం పునరావృతం కాని సంఖ్యను కలిగి ఉంటుంది.

ఇది మొత్తం 15 సంఖ్యలను కలిగి ఉంటాయి.అన్ని యంత్రాలలో కన్నా సూర్య యంత్రం ఎంతో శక్తివంతమైనది.

పురావస్తు శాస్త్రవేత్తలు పలని దేవాలయంలో ఒక మండపం లోని స్తంభం పై ఉన్న ఈ సూర్య యంత్రాన్ని కనుగొన్నారు.ఈ మండపం 17వ శతాబ్దానికి చెందినది.సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో జరిగే పంగుని ఉత్కం పండుగను ఈ మండపంలో జరుపుతారు.అయితే ఇక్కడి ప్రజలు పూర్వం 400 సంవత్సరాల క్రితం సుడోకు ఆటను దక్షిణ భారతీయులు ఆడి, ఈ స్తంభంపై చెప్పారని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు.

ఈ మండపం 13వ శతాబ్దం నుంచి అనేకసార్లు పునరుద్ధరించబడింది.

వాస్తవానికి ఇది వేరువేరు సంఖ్యలో ఉన్న సూర్య యంత్రం, కానీ మొత్తం మూడు వరుసలలో పదిహేను సంఖ్యను కలిగి ఉంటుంది.

ఈ యంత్రాల భావన మనకు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉనికిలో ఉంది.వీటిని లోహాల పై కూడా చెక్కబడి, వేలు ఉంగరాలు గా ధరిస్తుంటారు.రాగి పలకలపై చెక్కబడిన యంత్రాలు నీటిని శుద్ధి చేయడానికి, ఔషధాలను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.యంత్ర పలకలను బలిపీఠం కింద, ముఖ్యమైన ప్రదేశాలలో ఉంచుకుంటారు.

వాస్తు రీత్యా గ్రహ దోషాలు ఉన్న వారు వీటిని చిన్న,చిన్న ఆభరణాల పెండెంట్ లాగా తయారు చేసుకుని, చేతి ఉంగరాలు గా ధరిస్తారు.

పలని ఆలయ స్తంభంలో సూర్య యంత్రం 90 డిగ్రీల కుడి వైపునకు వాలి ఉంది.

అయితే మురుగన్ యంత్రం షడ్భుజి ఆకారంలో ఉంటుంది.సూర్య యంత్రంలో ప్రతి దిశ నుంచి 15 సంఖ్యలు ఉన్నందున,1+5=6 కావున ఇక్కడ 6 షణ్ముఖం అని తేల్చలేము.

యంత్రాలలో రాగి యంత్రం కన్నా, వెండి, బంగారు యంత్రాలకు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది.గ్రహ దోషాలు ఉన్న వారు ఈ యంత్రాలను ధరించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.

Suryayantram In Tamil Nadu Temple Surya Yantram, Tamil Nadu, Temple, Hindu Believes - Telugu Hindu, Surya Yantram, Tamil Nadu, Temple

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube