బోయపాటి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయనున్న సూర్య

తమిళ హీరోలు అందరూ కూడా టాలీవుడ్ పై ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు ఉంది.టాలీవుడ్ లో కూడా మార్కెట్ పెంచుకోవడానికి స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు.

 Surya Telugu Movie With Boyapati Srinu, Dil Raju, Tollywood, Kollywood, Boyapati-TeluguStop.com

ఇప్పటికే ఇళయదళపతి విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ సెట్ అయ్యింది.ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ఇక ఈ మూవీ కోసం విజయ్ కి ఏకంగా వంద కోట్ల రెమ్యునరేషన్ ని దిల్ రాజు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.భారీ బడ్జెట్ తోనే ఈ మూవీ తెరకెక్కనుంది.

ఇదిలా ఉంటే ధనుష్ కూడా స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.దీనిని పాన్ ఇండియా రేంజ్ లోనే ప్రాజెక్ట్ చేయనున్నారు.

ఎలాగూ బాలీవుడ్ ఇప్పటికే ధనుష్ రెండు సినిమాలు చేసి ఉన్నాడు.అలాగే స్ట్రైట్ తెలుగు ద్వారా పాన్ ఇండియా హీరోగా తనని తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

Telugu Boyapati Srinu, Dil Raju, Kollywood, Surya, Telugu, Tollywood-Movie

దీనికోసం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ముందుకోస్తున్నట్లు టాక్.అలాగే మైత్రీ నిర్మాతలు విజయ్ సేతుపతిని కూడా రంగంలోకి దించుటున్నారు.ఇప్పటికే అతను తెలుగులో సైరా, ఉప్పెన మూవీలలో నటించాడు.ఇక ఎన్టీఅర్, ప్రశాంత్ నీల్ సినిమా కోసం విజయ్ సేతుపతి పేరు వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు హీరో సూర్య కూడా స్ట్రైట్ తెలుగు సినిమాకి రెడీ అవుతున్నట్లు బోగట్టా.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక పవర్ ఫుల్ మాస్ కథతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెలుగు నుంచి చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బోగట్టా.

ఇక ఈ మూవీని కూడా దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.త్వరలో ఈ మూవీకి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube