స్టార్‌ హీరో మూవీ ఓటీటీ విడుదల నిర్ణయం మార్చకున్నారా ఏంటీ?  

surya surrai potru movie ott release will change the movie team unit,surrai potru movie, Surya, OTT Release, Akashame Nee haddu movie Release - Telugu Akashame Nee Haddu Movie Release, Ott, Ott Release, Sudha Kongara, Surrai Potru Movie, Surrai Potru Ott Release, Surya, Surya Surrai Potru Movie Ott Release Will Change The Movie Team Unit, Tamil Media, Theaters

తమిళ స్టార్‌ హీరో సూర్య సూరారైపోట్రూ తెలుగులో ఆకాశమే నీ హద్దురా ఓటీటీకి రెడీ అయిన విషయం తెల్సిందే.ఈ సినిమాను ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశారు.

TeluguStop.com - Surya Surrai Potru Movie Ott Release Will Change The Movie Team

థియేటర్ల విడుదల కోసం వెయిట్‌ చేసిన మేకర్స్‌ చివరకు ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యారు.థియేటర్లు మెల్ల మెల్లగా ఓపెన్‌ అవుతున్న ఈ సమయంలో మళ్లీ ఓటీటీ ఎందుకు అనుకుంటూ సూర్య సినిమా మేకర్స్‌ వెనుకడుగు వేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తమిళ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఆకాశమే నీ హద్దు సినిమా విడుదల విషయంలో మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాలని భావిస్తున్నారు.ఇటీవల ఖరారు చేసిన విడుదల తేదీని మరోసారి మార్చినట్లుగా తెలుస్తోంది.

TeluguStop.com - స్టార్‌ హీరో మూవీ ఓటీటీ విడుదల నిర్ణయం మార్చకున్నారా ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త తేదీ చాలా రోజులు ఉంటుందట.అప్పటి వరకు థియేటర్ల ఓపెనింగ్‌పై మరింత స్పష్టత వస్తుంది.

అందుకే మెల్లగా సాగదీస్తున్నారేమో అనిపిస్తుంది.

ఇప్పటికే సినిమాకు ఉన్న వేడి తగ్గింది.

ఇంకా ఆలస్యం చేస్తే సినిమా గురించి మాట్లాడుకోవడమే మానేస్తారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.చాలా సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో మీ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటీ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి సినిమా విడుదల విషయంలో సూర్య ఎటు తేల్చుకోలేక పోతున్నారు.

ఈ సినిమాకు తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించారు.ఇది ఒక సామాన్యమైన వ్యక్తి ఏకంగా ఎయిర్‌ కంపెనీని ఎలా మొదలు పెట్టాడు అనేది కథ.ఇందులో చాలా ఎమోషన్స్ మరియు అద్బుతమైన ట్విస్ట్‌లు ఉంటాయని సినిమా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది.సినిమా పాటలు ఇప్పటికే మంచి ఆధరణ దక్కించుకుంటున్నాయి.

అందుకే సినిమా కూడా బాగుంటుందేమో అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తు ఉంటే మేకర్స్ మాత్రం దాగుడు మూతలు ఆడుతున్నారు.ఇది ఎంత వరకు సబబు అంటూ తమిళ మీడియా మరియు ప్రేక్షకులు చిత్ర యూనిట్‌ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.

#Tamil Media #Sudha Kongara #Surya #Theaters #SuryaSurrai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Surya Surrai Potru Movie Ott Release Will Change The Movie Team Related Telugu News,Photos/Pics,Images..