వామ్మో.. సూర్య ఒక్కో సినిమాకు అంత తీసుకుంటున్నాడా..?

కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్ట్రెయిట్ హీరోలకు సమానంగా హీరో సూర్య గుర్తింపును సంపాదించుకున్నారు.తెలుగు రాష్ట్రాల్లోని ఒక వర్గం ప్రేక్షకులు సూర్య సినిమాలంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు.

 Hero Surya Shocking Remuneration For His Next Movie, Hero Surya, Next Movie, Sho-TeluguStop.com

సినిమాల విషయంలో ప్రయోగాలు ఎక్కువగా చేసే సూర్య సినిమాలు కమర్షియల్ గా ఎలాంటి ఫలితాలను అందుకున్నా నటుడిగా ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి.

గత కొన్నేళ్ల నుంచి సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సూర్య గతేడాది ఆకాశమే నీ హద్దురా సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఆకాశమే నీ హద్దురా సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులకు నవ్యత ఉన్న సినిమాను చూశామనే అనుభూతిని కలిగించింది.అయితే ఈ సినిమా సక్సెస్ తో సూర్య రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Telugu Surya, Vadi Vasal-Movie

ఆకాశం నీ హద్దురా సినిమా తరువాత సూర్య ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది.35 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ చాలా ఎక్కువ మొత్తమే అయినా సూర్యకు కోలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో మార్కెట్ ఉంది.ప్రస్తుతం వాడి వాసల్ అనే సినిమాలో సూర్య నటిస్తున్నారు.ఈ సినిమా కాకుండా మరికొన్ని కొత్త కథలను సూర్య వింటున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం సూర్య నటిస్తున్న వాడి వాసల్ సినిమాకు 35 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈ సినిమా కూడా హిట్టైతే సూర్య రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

అయితే సూర్య రికార్డు స్థాయిలో తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇతర హీరోలను అవాక్కయ్యేలా చేస్తోందని తెలుస్తోంది.సూర్య నటిస్తున్న వాడివాసల్ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube