సూర్య సూపర్ హిట్ సినిమాకి ఘోరమైన టీఆర్పీ రేటింగ్- Surya New Movie Lowest Trp Rating

Surya New Movie Lowest TRP Rating , Tollywood, Telugu Cinema, South Cinema, Sudha Kongara, Aakasam Nee Haddura Movie - Telugu Aakasam Nee Haddura Movie, Hero Surya, South Cinema, Sudha Kongara, Telugu Cinema, Tollywood, Trp Rating

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా ఆకాశం నీ హద్దురా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.నిజ జీవిత కథని స్ఫూర్తిగా తీసుకొని సినిమాటిక్ వెర్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది.

 Surya New Movie Lowest Trp Rating-TeluguStop.com

హైయెస్ట్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది.సుధా కొంగర దర్శకత్వంలో తమిళంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇక తమిళం, తెలుగు బాషలలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇందులో సూర్య పెర్ఫార్మెన్స్ ని మంచి ప్రశంసలు లభించాయి.

 Surya New Movie Lowest Trp Rating-సూర్య సూపర్ హిట్ సినిమాకి ఘోరమైన టీఆర్పీ రేటింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా పెద్ద కోరికని ఒక సామాన్యుడు ఎలా నెరవేర్చుకున్నారు అనే ఎలిమెంట్ తో ఈ సినిమాని సుధా కొంగర తెరకెక్కించింది.ఇదిలా ఉంటే థియేటర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే వంద కోట్లకి పైగా కలెక్షన్ సొంతం చేసుకునేది అనేది సినీ విశ్లేషకులు అభిప్రాయం పడ్డారు.

ఇక ఇంత మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని జేమిటి టీవీ సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా ఆకాశం నీ హద్దురా సినిమా టెలివిజన్ ప్రీమియర్ ప్రసారమైంది.సంక్రాంతి పండగ సందర్భంగా ఇది టీవీలో ప్రసారం కావడంతో మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది అని అందరూ భావించారు.అయితే ఊహించని విధంగా ఈ సినిమాకి టీఆర్ఫీ రేటింగ్ వచ్చింది.కేవలం 6.83 టీఆర్ఫీ రేటింగ్ మాత్రమే సాధించింది.ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ రేటింగ్ తో టీవీ వీక్షకుల ఆదరణని నోచుకోని సూపర్ హిట్ సినిమా అంటేఇదే అని చెప్పాలి.అయితే అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ లో రిలీజ్ కావడంతో, ఆన్ లైన్ లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేయడం వలెనే టీవీలో పెద్దగా ఎవరూ చూడలేదని టాక్ వినిపిస్తుంది.

#Hero Surya #Sudha Kongara #AakasamNee #TRP Rating

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు