వినడానికే వింత కథ.. సూర్య నందా సినిమా..

సూర్య.తమిళ సినిమా పరిశ్రమలో టాప్ హీరో.

 Surya Nanda Movie Unknown Facts, Surya, Hero Surya, Kollywood Actor, Nanda Movie-TeluguStop.com

ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి గ్రేట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే.

తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసినా.ఓ మూవీ విషయంలో తాను ఎప్పటికీ మర్చిపోలేని ముగింపు ఉన్నట్లు వెల్లడించాడు.

ఈ సినిమా తను హీరోగా ఎదుగుతున్న తొలిరోజుల్లోనే చేశాడు.ఇంతకీ ఆ సినిమా ఏంటో.

ఆ ముగింపు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో సూర్య కొద్ది కాలంలోనే మంచి హీరోగా వెలుగొందాడు.

అయితే.తనకు చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉండేదట.

సినిమా చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన ముగింపు ఉండే ఓ సినిమా చేయాలనుకునేవాడట.అంతేకాదు.

ఈ సినిమాకు కథ అద్భుతంగా ఉండాలని భావించాడట.అలాంటి సినిమా కోసం ఆయన చాలా కాలం వెతికాడట.

ఆ వడపోతలో భాగంగానే తనకు ఓ మంచి కథ దొరికిందట.అదే నందా మూవీ స్టోరీ.

ఈ సినిమాలో చిన్నప్పుడు సూర్య తన తండ్రిని చంపుతాడు.అప్పటి నుంచి తన తల్లికి సూర్య అంటే ఇష్టం ఉండదు.ఈ సినిమా చివర్లో సూర్యకు తన తల్లి విషం కలిపిన అన్నం పెడుతుంది.అందులో విషం కలిపిన విషయం తెలిసినా.

తను అలాగే తింటాడు సూర్య.

Telugu Bala, Flashback, Surya, Kollywood, Nanda, Sad Mvoie, Surya Killa, Suryana

తను కొంత సేపటి తర్వాత చనిపోతాడు.కొడుకు మరణం చూసి తల్లి కూడా చనిపోతుంది.ఈ స్టోరీ వినడానికి కొత్తగా ఉన్నా… ఇదే కథతో సినిమాను తెరకెక్కించారు.

దర్శకుడు బాల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.అంతేకాదు.

వరుసగా సాడ్ ఎండింగ్ సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టాడు.నిజానికి సినిమాలో హీరో చనిపోవడం అంటే అభిమానులు జీర్ణించుకోలేరు.

కానీ.బాలా సినిమాల్లో ఓ ప్రత్యేత ఉంటుంది.

కథ ఎలాంటిదైనా తను తీసే విధానంతో సక్సెస్ అవుతాడు.ఆయన సినిమాల్లో ఎంతో ఎమోషన్ ఉంటుంది.

అందుకే సినిమా దుఖంతో ఎండైనా జనాలకు బాగా ఎక్కేవి.అందుకే ఆయన సినిమాలన్నీ విజయం సాధించేవి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube