సూర్య సినిమాల్లో చెప్పిందే.. నిజంగా బయట జరుగుతోంది..

సినిమాలను నిజజీవితంతో పోల్చి చూస్తుంటాం.ఎందుకంటే బయట జరిగేదే సినిమాల్లో చూపిస్తుంటారు మూవీ మేకర్స్.

 Surya Movie Dialogues Are Coming True In Real Life-TeluguStop.com

అయితే కొన్ని సినిమాల్లో చూపించిన అంశాలే నిజజీవితంలో జరిగితే నిజంగా ఆశ్చర్యపోవక తప్పదు.సేమ్ ఇలాగే జరుగుతుంది సూర్య నటించిన సినిమాల విషయంలో.

ఆయన నటించిన సినిమాల్లో రూపొందించిన సీన్లు.బయట కూడా జరుగుతూ జనాలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

 Surya Movie Dialogues Are Coming True In Real Life-సూర్య సినిమాల్లో చెప్పిందే.. నిజంగా బయట జరుగుతోంది..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ తను నటించిన ఏ సినిమాల్లోని ఘటనలు ఇప్పుడు ఎలా జరుగుతన్నాయో తెలుసుకుందాం.

గజినీ మూవీలో సూర్యా ఎయిర్ వాయిస్ మొబైల్ కంపెనీ ఓనర్ గా నటించాడు.

ఆయన అన్నీ వదిలేసి ఓ అమ్మాయి వెనకాల తిరుగుతాడు.ఈ సినిమా ఓ రేంజిలో విజయం సాధించింది.

ఈ సినిమాను పోలి ఉండేలా ఇండియన్ మైక్రోమాక్స్ ఓనర్ రావుల్ శర్మ సైతం అసిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.సేమ్ గజనీ సినిమాకు వీరి పెళ్లి సూటవుతుంది.

అటు సెవెంత్ సెన్స్ మూవీలో చైనా బయోవార్ గురించి ఉంటుంది. ఇందులో డాంగ్లీ అనే చైనా వ్యక్తి ఇండియాకు వచ్చి అత్యంత ప్రమాదకరమైన వైరస్ ను వీధికుక్క శరీరంలోకి ప్రవేశపెడతాడు.

ఆ వైరస్ నెమ్మదిగి జనాలకు సోని దేశమంతా అల్లకల్లోలం అవుతుంది.తాజాగా వచ్చిన కరోనా వైరస్ కూడా చైనా నుంచే రావడంతో ఈ సినిమాకు సరిపోయింది.

వీడోక్కడే సినిమాలో భారత్ వరల్డ్ కప్ కొట్టినట్లు ఉంటుంది.ఈ సినిమా రిలీజ్ అయ్యాక.2012లో టీమిండియా వరల్డ్ కప్ సాధిస్తుంది.బ్రదర్స్ సినిమాలో ఓ దేశాన్ని బ్యాన్ చేస్తారు.2016 తర్వాత రష్యాను ఒలింపిక్స్ సంఘం బ్యాన్ చేసింది.సింగం-2 సినిమాలో సూర్య డీఎస్పీగా ఉంటూ లాక్ డౌన్ పెడతాడు.సేమ్ ఇలాగే కరోనా నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఇంప్లిమెంట్ అయ్యింది.

Telugu Bandobastu, Brothers, Gang, Ghajini, Movies, Seventh Sense, Surya, Surya Movie Dialogues Are Coming True In Real Life-Latest News - Telugu

బందోబస్తు సినిమాలో పంటవేసి వేసిన రైతులను కొన్ని కోట్ల మిడతలు వచ్చి వాటిని నాశనం చేస్తాయి.తాజాగా ఉత్తర భారతంలోనూ ఈ ఘటనలు జరిగాయి.గ్యాంగ్ మూవీలో రమ్యకృష్ణ, సూర్య బిజినెస్ పీపుల్స్ సిబిఐ రైడ్స్ పేరిట ధనవంతులను కొల్లగొడతారు.

గుంటూరుకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటికి ఈ మధ్య సిబిఐ వాళ్ళ పేరుతో ఫేక్ రైడ్స్ జరిగాయి.అటు సూర్య నిర్మించిన ఉరియాడి 2 సినిమాలో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవుతుంది.

తాజాగా వైజాగ్ లో గ్యాస్ లీక్ ఘటన జరిగింది.

#Surya #SuryaMovie #Seventh Sense #Bandobastu #Brothers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు