సూర్య కుమార్ ఆడిన ఫన్నీ షాట్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది.ఈ మ్యాచ్ లో గెలవాలని రోహిత్ సేన చాలా ప్రాక్టీస్ చేస్తోంది.

 Surya Kumar Yadav Funny Shot Against Australia In Warm Up Match Details, Suryaku-TeluguStop.com

రోహిత్ శర్మ టీమ్‌ ఇప్పుడు వార్మప్ మ్యాచ్ లు కూడా ఆడుతుంది.కాగా తాజాగా ఒక వార్మప్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు.

రీసెంట్‌గా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సూర్యకుమార్ తన సత్తా చూపించాడు.ఈ గేమ్‌లో యాదవ్ సునాయాసంగా 50 పరుగులు చేశాడు.

అతడి కీలకమైన రన్స్ కారణంగా ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది.

బ్యాటర్ సూర్యకుమార్ జస్ట్ 33 బంతుల్లో 50 పరుగులు చేసి రన్స్ బాగా పెంచేసాడు.

తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.నిజానికి అతని ఔట్ ఊహించని విధంగా జరిగింది.

కేన్ రిచర్డ్‌సన్‌ వేసిన 20వ ఓవర్‌లో 4వ బాల్‌కి సూర్య క్యాచ్ ఔట్ అయ్యాడు.నిజానికి ఈ బంతిని లాంగ్ షాట్ ఆడాలని సూర్య అనుకున్నాడు కానీ అది నేరుగా వెళ్లి ఆస్ట్రేలియన్ బౌలర్ రిచర్డ్‌సన్ చేతిలో పడింది.

చాలా గట్టిగా బ్యాట్‌ను ఊపితే ఆ బంతి అతని చుట్టూ గుండ్రంగా తిరిగింది.

దాంతో ఏం జరుగుతుందోనని సూర్యకుమార్ యాదవ్ కాసేపు అయోమయంలో పడిపోయాడు.అంతలోనే ఆ బంతి వచ్చి బౌలర్ చేతిలో పడింది.ఇంత సింపుల్ క్యాచ్ ఊహించని బౌలర్ నవ్వుకున్నాడు.

రిచర్డ్‌సన్ ఆ బంతి కూడా బౌండరీ వెళ్తుందని అనుకున్నాడు.కానీ అది తన చేతిలోకి రావడంతో అతను ఆశ్చర్యపోయాడు.

ఆపై నవ్వుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు కూడా నవ్వుకుంటున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube