జై భీమ్ పై వివాదం.. స్పందించిన దర్శకుడు..!

గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయం నేపథ్యంలో రియల్ స్టోరీని కథగా అల్లుకుని తెరకెక్కిన సినిమా జై భీమ్.జ్ఞానవెల్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను సూర్య తన 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు.

 Surya Jai Bhim Issue Director Response , Director Gnavel, Jai Bheem, Kollywood,-TeluguStop.com

సినిమాలో సూర్య లీడ్ రోల్ లో నటించారు.సినిమా రిలీజై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకోగా రిలీజ్ కు ముందే తమ బృదంలోని కొందరు సభ్యులు సినిమా చూశామని అన్నారు డైరక్టర్ జానవెల్.

అయితే సినిమా గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్యాలెండర్ దృశ్యాన్ని అప్పుడు మేము గమనించలేకపోయాం.చూసి ఉంటే రిలీజ్ కు ముందే దాన్ని తొలగించేవాడిని.

రిలీజ్ తర్వాత దానిపై కొందరు అసహనం వ్యక్తం చేయగా.వివాదం మరింత ముదరకముందే ఆ సీన్లు మార్చేశాం.

ఆ టైం లో ప్రేక్షకులు అర్ధం చేసుకున్నారని భావిస్తున్నాను.అయితే ఈ సినిమా విషయంపై సూర్య బాధ్యత వహించాలని కొందరు కోరుతున్నారు.కావాలని ఆయన్ను టార్గెట్ చేస్తున్నారని అన్నారు దర్శకుడు జ్ఞానవెల్.ఓ నటుడిగా గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలని వెలుగులోకి తీసుకు రావాలని ప్రయత్నం చేశారు సూర్య.

ఈ విషయంపై పూర్తి బాధ్యత నాదే అన్నారు జ్ఞానవెల్.ఇప్పటివరకు జరిగిన పరిణామాల విషయంలో సూర్య తనని క్షమించాలని కోరారు.

ఓ వ్యక్తినో.ఓ వర్గాన్నో కించపరచే ఉద్దేశం లేదని.

సినిమా వల్ల బాధపడిన వారికి తను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు జ్ఞానవెల్.కష్టకాలంలో తమకు మద్ధతుగా నిలిచిన సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రేక్షకులకు, మీడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు జ్ఞానవెల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube